AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సోంపు గురించి ఈ నిజాలు తెలిస్తే నోరెళ్లబెడతారు.. అన్నం తిన్న తర్వాత ఎందుకు తినాలంటే..?

మన భారతీయ సంప్రదాయంలో భోజనం తర్వాత సోంపు గింజలు అందించడం అనేది తరతరాలుగా వస్తున్న ఆచారం. హోటళ్లకు వెళ్లినా, ఇంట్లో విందు భోజనం చేసినా చివరగా సోంపుతోనే ముగిస్తాం. అయితే, ఇది కేవలం నోటి తాజాదనం కోసం మాత్రమే అనుకుంటే మనం పొరపడినట్లే.. సోంపు గింజలు ఒక శక్తివంతమైన డైజెస్టివ్ ఏజెంట్ అని, ఇవి శరీరానికి ఎన్నో రకాలుగా మేలు చేస్తాయని ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ సౌరభ్ సేథి శాస్త్రీయంగా వివరిస్తున్నారు.

Krishna S
|

Updated on: Apr 06, 2026 | 12:23 PM

Share
గ్యాస్, ఉబ్బరానికి చెక్: భారీ భోజనం చేసినప్పుడు మన జీర్ణవ్యవస్థపై ఒత్తిడి పెరుగుతుంది. ఆ సమయంలో సోంపు గింజలు అద్భుతంగా పనిచేస్తాయి. డాక్టర్ సేథి ప్రకారం.. సోంపులో అనెథోల్, ఫెంచోన్, ఎస్ట్రాగోల్ వంటి ముఖ్యమైన నూనెలు ఉంటాయి. ఇవి కడుపులోని గ్యాస్‌ను బయటకు పంపడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా కడుపు ఉబ్బరం, అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యల నుండి ఇవి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి.

1 / 5
సహజమైన మౌత్ ఫ్రెషనర్: నోటి శుభ్రత విషయంలో సోంపు గింజలు ఒక సహజ సిద్ధమైన ఔషధం. వీటిని నమలడం వల్ల నోటిలో లాలాజల ఉత్పత్తి పెరుగుతుంది. ఇది నోటిలోని హానికర బ్యాక్టీరియాను తొలగించడమే కాకుండా చిగుళ్ల ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. సోంపులోని సుగంధ తైలాలు మీ శ్వాసను రోజంతా తాజాగా ఉంచుతాయి.

2 / 5
ప్రేగులకు ఉపశమనం: చాలామందికి తిన్న వెంటనే కడుపులో అసౌకర్యంగా లేదా తిమ్మిర్లు వచ్చినట్లు అనిపిస్తుంది. సోంపు గింజలకు యాంటిస్పాస్మోడిక్ గుణాలు ఉన్నాయి. అంటే, ఇవి ప్రేగులలోని కండరాలను సడలించి, ఆహారం సులభంగా ముందుకు కదిలేలా చేస్తాయి. దీనివల్ల జీర్ణరసాల స్రావం పెరిగి, మనం తిన్న ఆహారం త్వరగా విచ్ఛిన్నం అవుతుంది.

3 / 5
బరువు తగ్గడంలో కూడా సహాయం: సోంపు గింజలలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీవక్రియను వేగవంతం చేయడంలో తోడ్పడుతుంది. భోజనం తర్వాత సోంపు తీసుకోవడం వల్ల అనవసరమైన ఆకలి కలగదు, తద్వారా అతిగా తినడాన్ని నియంత్రించవచ్చు. ఇది పరోక్షంగా బరువు తగ్గాలనుకునే వారికి కూడా మేలు చేస్తుంది.

4 / 5
డాక్టర్ సలహా ఏంటంటే?: ప్రతిరోజూ భోజనం ముగిసిన తర్వాత ఒక టీస్పూన్ సోంపు గింజలను బాగా నమిలి తినాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. సోంపును నేరుగా నమలడం శ్రేయస్కరం. కావాలంటే కొంచెం పటిక బెల్లం కలుపుకోవచ్చు, కానీ చక్కెర కోటింగ్ ఉన్న సోంపు కంటే సహజమైన గింజలే ఆరోగ్యానికి మంచివి. ఒకవేళ గింజలు నమలడం ఇష్టం లేని వారు, సోంపును నీటిలో మరిగించి సోంపు టీ లాగా కూడా తీసుకోవచ్చు.

5 / 5
Follow Us
భారత ట్రక్కు డ్రైవర్లు.. వెళ్లిపొండి! సిక్కు సంఘాలు సీరియస్

పుతిన్, జిన్‌పింగ్‌కు స్పెషల్ సెక్యూరిటీ.. ఏ రేంజ్‌లో ఉందంటే!

మరో వారంలో వీరికి జాక్‌పాట్.. కెరీర్‌లో పురోగతి, చేతిలో డబ్బు!

SBIలో ఎఫ్‌డీపై రూ. 1 లక్ష డిపాజిట్‌ చేస్తే మెచ్యూరిటీ సమయంలో ఎంత?

రైలు పట్టాల కింద కంకర రాళ్లు ఎందుకు పోస్తారో తెలుసా?

బొజ్జ గణపయ్యకి ఇష్టమైన బెల్లం కుడుములు..ఇలా చేస్తే రుచి అద్భుతమే

కనకాంబరం మొక్క పూలు పూయట్లేదా? ఇంట్లో దొరికే ఈ మూడు కలిపి వేయండి

భారత్‌ అమ్ములపొదిలో 190 అణు వార్‌హెడ్లు.. తయారీ దశలో మరో 35

ఎండుమిరపకాయల పప్పు.. వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసి తింటే.. అబ్బో

నిమ్మకాయలు నెల రోజులైనా ఫ్రెష్‌గా ఉంటాయ్.. ఈ సింపుల్ ట్రిక్స్..