AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హాఫ్ సెంచరీతో గట్టిగా ఇచ్చిపడేసిన కాటేరమ్మ కొడుకు.. కట్‌చేస్తే.. చెత్త రికార్డులో అభిషేక్..

Abhishek Sharma Unfortunate Record: అభిషేక్ శర్మకు జింబాబ్వేపై చేసిన రెండు అర్ధ సెంచరీలే అతని కెరీర్‌లో అత్యంత నెమ్మదైన ఫిఫ్టీలు కావడం విశేషం. అయినప్పటికీ, వరుసగా విఫలమైన తర్వాత వచ్చిన ఈ ఇన్నింగ్స్ అతనికి ఆత్మవిశ్వాసాన్ని తిరిగి తీసుకొచ్చే కమ్‌బ్యాక్‌గా మారింది.

హాఫ్ సెంచరీతో గట్టిగా ఇచ్చిపడేసిన కాటేరమ్మ కొడుకు.. కట్‌చేస్తే.. చెత్త రికార్డులో అభిషేక్..
Abhishek Sharma
Venkata Chari
|

Updated on: Feb 26, 2026 | 8:28 PM

Share

Abhishek Sharma Unfortunate Record: టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశలో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌కు ముందు టీమిండియాకు అతిపెద్ద తలనొప్పి అభిషేక్ శర్మ ఫామ్‌నే. ప్రపంచ నంబర్-1 టీ20ఐ బ్యాట్స్‌మన్‌గా టోర్నీలోకి అడుగుపెట్టిన అభిషేక్, మొదటి మూడు మ్యాచ్‌ల్లో వరుసగా మూడు డక్స్‌తో తీవ్ర నిరాశపరిచాడు. యునైటెడ్ స్టేట్స్‌తో మ్యాచ్‌లో డక్‌తో ఖాతా తెరిచిన అభిషేక్, పాకిస్థాన్, నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌ల్లో కూడా సున్నాకే ఔట్ అయ్యాడు. దీంతో అతని ఆత్మవిశ్వాసం పూర్తిగా దిగజారింది. సూపర్-8లో దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో ఖాతా తెరిచినప్పటికీ కేవలం 15 పరుగులకే పరిమితమయ్యాడు.

26 బంతుల్లో అర్ధ సెంచరీ చేసినా చేదు రికార్డు..

జింబాబ్వే బౌలర్లు అభిషేక్ శర్మను కట్టడి చేసేందుకు ప్రత్యేక ప్రణాళికతో బరిలోకి దిగారు. మొదట్లో నెమ్మదిగా ఆడిన అభిషేక్, తొలి బౌండరీ తర్వాత పూర్తిగా గేర్ మార్చాడు. చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్‌లో 26 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసి అభిమానులను ఉత్సాహపరిచాడు.

అయితే ఇది అతనికి ఒక చేదు రికార్డుగా కూడా మారింది. టీ20 ఫార్మాట్‌లో అతని రెండో అత్యంత నెమ్మదైన అర్ధ సెంచరీ ఇదే (26 బంతుల్లో 50). ఆసక్తికరంగా, అతని అత్యంత స్లో ఫిఫ్టీ కూడా జింబాబ్వేపైనే నమోదైంది. 2024లో హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో 33 బంతుల్లో 50 పరుగులు చేసి అప్పటివరకు అతని కెరీర్‌లో అత్యంత నెమ్మదైన ఫిఫ్టీగా నిలిచింది.

అంటే అభిషేక్ శర్మకు జింబాబ్వేపై చేసిన రెండు అర్ధ సెంచరీలే అతని కెరీర్‌లో అత్యంత నెమ్మదైన ఫిఫ్టీలు కావడం విశేషం. అయినప్పటికీ, వరుసగా విఫలమైన తర్వాత వచ్చిన ఈ ఇన్నింగ్స్ అతనికి ఆత్మవిశ్వాసాన్ని తిరిగి తీసుకొచ్చే కమ్‌బ్యాక్‌గా మారింది.

ఈ ప్రదర్శనతో అభిషేక్ మళ్లీ తన పాత ఫామ్‌లోకి వస్తాడని టీమిండియా ఆశిస్తోంది. సూపర్-8లో మిగిలిన మ్యాచ్‌ల్లో అతని బ్యాటింగ్ భారత్‌కు కీలకంగా మారనుంది.

Follow Us