విజయనగరం జిల్లాలో బంగారి అప్పలరాజు అప్పులు చేసి కొనుక్కున్న కొత్త ఆటో తెల్లవారేసరికి చోరీకి గురైంది. తన స్వంత బండి కలలు కల్లలవడంతో అప్పలరాజు తీవ్ర ఆవేదన చెందుతున్నాడు. ఈ ఘటనపై కొత్తవలస పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు.