AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కుమ్మేస్తున్న కుర్రాళ్లు.. ఒక్కరు కూడా తగ్గట్లేదు

కుమ్మేస్తున్న కుర్రాళ్లు.. ఒక్కరు కూడా తగ్గట్లేదు

Dr. Challa Bhagyalakshmi - ET Head
| Edited By: |

Updated on: Feb 26, 2026 | 8:54 PM

Share

2026లో తెలుగు సినిమా పరిశ్రమ యువ దర్శకుల ఆధిపత్యాన్ని చూడబోతోంది. రాజమౌళి వంటి అగ్ర దర్శకులు బిజీగా ఉండగా, బుచ్చిబాబు ('పెద్ది'), వశిష్ట ('విశ్వంభర') వంటి నూతన తరం దర్శకులు తమ భారీ ప్రాజెక్టులతో తెరపైకి వస్తున్నారు. రోహిత్, శ్రీకాంత్ ఓదెల, సంకల్ప్ రెడ్డి, కార్తీక్ దండు వంటి యువ ప్రతిభావంతులు టాలీవుడ్‌లో కొత్త శకాన్ని ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నారు.

తెలుగు ఇండస్ట్రీలో కుర్రాళ్ల రాజ్యం నడుస్తుంది.. 2026లో అగ్ర దర్శకులెవరూ వచ్చేలా కనిపించడం లేదు. రాజమౌళి, సుకుమార్ ఇలా అంతా వేరే సినిమాలతో బిజీగా ఉన్నారు. దాంతో ఈ లోటు కుర్ర దర్శకులే భర్తీ చేసేలా ఉన్నారు. మరి ఈ ఏడాది రాబోయే ఈ చిచ్చర పిడుగులు ఎవరు..? వాళ్లు చేస్తున్న ఆ సినిమాలేంటి..? టాలీవుడ్‌లో ఉన్న కుర్ర దర్శకుల గ్యాంగ్‌కు బుచ్చిబాబు పెద్దదిక్కులా మారిపోయారు. ఈయన తెరకెక్కిస్తున్న పెద్దిపై అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి. ఉప్పెన తర్వాత నాలుగేళ్ళుగా పెద్దితోనే బిజీగా ఉన్నారు బుచ్చిబాబు. ఏప్రిల్ 30న పెద్ది విడుదల కానుంది. అలాగే ఇదే ఏడాది రాబోతున్న మరో డైనమైట్ వశిష్ట. ఆయన చేస్తున్న సినిమా విశ్వంభర. విశ్వంభర షూటింగ్ ఎప్పుడో పూర్తైనా.. VFX జాప్యంతో లేట్ అవుతుంది. జులైలో విడుదలయ్యే సూచనలున్నాయి. బింబిసారతో బ్లాక్‌బస్టర్ కొట్టిన వశిష్ట.. ద్వితీయ విఘ్నం దాటాలని చూస్తున్నారు. మన శంకరవరప్రసాద్ గారు సక్సెస్ దీనికి హెల్ప్ అయ్యేలా కనిపిస్తుంది. ఇక కొత్త దర్శకుడు రోహిత్ తెరకెక్కిస్తున్న సంబరాల ఏటిగట్టుతో 2026లోనే రానుంది. 100 కోట్లకు పైగా బడ్జెట్‌తో సంబరాల ఏటిగట్టు తెరకెక్కిస్తున్నారు రోహిత్. అలాగే ప్యారడైజ్‌తో పిచ్చెక్కించాలని ఫిక్సైపోయారు శ్రీకాంతో ఓదెల. ఇక సంకల్ప్ రెడ్డి సైతం గోపీచంద్ సినిమాతో మ్యాజిక్ చేయాలని చూస్తున్నారు. నాగ చైతన్య వృషకర్మతో విరూపాక్ష ఫేమ్ కార్తీక్ దండు మరో బ్లాక్‌బస్టర్‌పై కన్నేసారు. మొత్తానికి 2026 ఎటు చూసినా అంతా కుర్ర దర్శకులే కనిపిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Nani: నాని డబుల్ బ్లాస్ట్.. ఈసారి మామూలుగా ఉండదు

నాలుగేళ్ళ కష్టం వర్సెస్ ఆర్నెళ్ల అదృష్టం.. ఏది గెలుస్తుంది

Vijay-Rashmika Marriage: 100 మంది అతిథులకు మాత్రమే ఆహ్వానం ??

Roshan: లవ్ స్టోరీస్ మీద ఫోకస్ చేస్తున్న యంగ్ హీరో

Ajith: కన్‌ఫ్యూజ్ చేస్తున్న కోలీవుడ్ స్టార్ అజిత్

Follow Us