ఒడిశాలో గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ దేబబత్ర మొహంతి అవినీతి కేసులో విజిలెన్స్ అధికారులకు చిక్కారు. కటక్‌లోని ఆయన నివాసంపై జరిపిన దాడిలో రూ.4 కోట్ల నగదుతో పాటు భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. 40 వేల రూపాయల లంచం తీసుకుంటుండగా మొహంతిని అరెస్టు చేశారు. ఈ ఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించింది.