చిత్తూరు జిల్లా పలమనేరులోని ఓ జిమ్లో 27 ఏళ్ల డీసీసీబీ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ విశ్వనాథ్ వ్యాయామం చేస్తూ కుప్పకూలిపోయారు. గుండెపోటుతో మరణించినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. తోటి సభ్యులు ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోయింది. ఆయనకు భార్య, ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు.