కాకినాడ జిల్లా అన్నవరంలోని పంపానది ప్రాజెక్టు గేట్ల వద్ద భారీ కొండచిలువ ప్రత్యక్షమై స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. యువకుల సమాచారంతో అటవీ శాఖకు చెందిన స్నేక్ క్యాచర్ చాకచక్యంగా కొండచిలువను బంధించారు. ఎటువంటి హాని జరగకుండా సురక్షిత ప్రాంతంలో విడిచిపెట్టడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.