AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2026: భారత్ కన్నా పాకే ముద్దు.. ఐపీఎల్‌కు కోహ్లీ కెప్టెన్ గుడ్ బై..!

IPL 2026 వేలానికి ముందు, ప్రతి జట్టు తమ రిటెన్షన్‌లను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఢిల్లీ క్యాపిటల్స్ తమ స్టార్ ఆటగాడిని నిలుపుకోలేదు. అప్పటి నుంచి ఈ లెజెండరీ బ్యాట్స్‌మన్‌ను ఏ జట్టు కొనుగోలు చేయనుందోనని అంతా ఆసక్తి చూపించారు. కానీ, ఈ లోపే షాకింగ్ నిర్ణయం వచ్చింది.

IPL 2026: భారత్ కన్నా పాకే ముద్దు.. ఐపీఎల్‌కు కోహ్లీ కెప్టెన్ గుడ్ బై..!
Faf Du Plessis
Venkata Chari
|

Updated on: Nov 30, 2025 | 8:09 AM

Share

ఐపీఎల్ అభిమానులకు దక్షిణాఫ్రికా స్టార్ బ్యాటర్, మాజీ కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ షాక్ ఇచ్చాడు. రాబోయే ఐపీఎల్ 2026 సీజన్ కోసం జరగనున్న వేలంలో తన పేరును నమోదు చేసుకోవడం లేదని ఆయన ప్రకటించారు. దాదాపు 14 ఏళ్ల సుదీర్ఘ ఐపీఎల్ కెరీర్ తర్వాత ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

ఐపీఎల్‌కు ఎందుకు దూరమవుతున్నాడు?

అబుదాబి వేదికగా జరగనున్న ఐపీఎల్ వేలానికి కొన్ని రోజుల ముందు డు ప్లెసిస్ సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. “ఐపీఎల్‌లో 14 ఏళ్లు గడిపిన తర్వాత, ఈసారి వేలంలో నా పేరు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నాను. ఇది చాలా పెద్ద నిర్ణయం. కానీ, ఎంతో కృతజ్ఞతతో తీసుకున్నాను” అని పేర్కొన్నాడు. అయితే, తాను క్రికెట్‌కు పూర్తిగా గుడ్ బై చెప్పడం లేదని, ఈసారి కొత్త సవాలును స్వీకరిస్తూ పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL) రాబోయే సీజన్‌లో ఆడనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. భారత్ తన హృదయంలో ఎప్పుడూ ప్రత్యేక స్థానంలో ఉంటుందని, ఇది వీడ్కోలు కాదని అభిమానులకు భరోసా ఇచ్చారు.

ఐపీఎల్‌లో డు ప్లెసిస్ ప్రస్థానం ఫాఫ్ డు ప్లెసిస్ 2012లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ద్వారా ఐపీఎల్‌లోకి అడుగుపెట్టారు. చెన్నై తరపున అద్భుత ప్రదర్శన చేసి 2018, 2021లో టైటిల్ విజయాల్లో కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) కు కెప్టెన్‌గా వ్యవహరించారు. గత సీజన్‌లో ఆయన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో భాగంగా ఉన్న సంగతి తెలిసిందే. కానీ వేలానికి ముందు ఆ ఫ్రాంచైజీ ఆయన్ను రిలీజ్ చేసింది.

డు ప్లెసిస్ గణాంకాలు..

ఐపీఎల్‌లో ఇప్పటివరకు 154 మ్యాచ్‌లు ఆడిన డు ప్లెసిస్, 4773 పరుగులు సాధించారు. ఇందులో 39 అర్ధశతకాలు ఉన్నాయి. చెన్నై, పుణె, బెంగళూరు, ఢిల్లీ వంటి జట్ల తరపున ఆడిన ఆయన, లీగ్‌లో అత్యంత విజయవంతమైన విదేశీ బ్యాటర్లలో ఒకరిగా గుర్తింపు పొందాడు.

డు ప్లెసిస్ ఈ నిర్ణయంతో ఐపీఎల్ 2026 సీజన్‌లో ఆయన మెరుపులను అభిమానులు మిస్ కానున్నారు. కాగా, ఈ నిర్ణయం వెనుక పలు కారణాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్‌సీబీ తరపున అద్భుతంగా ఆడినా, తర్వాత ఏడాదిలోనే ఆర్‌సీబీ యాజమాన్యం రిలీజ్ చేసింది. అలాగే, గతేడాది ఢిల్లీ తరుపున ఆకట్టుకున్నా, ఈ ఏడాది ఢిల్లీ ఫ్రాంచైజీ కూడా రిలీజ్ చేసింది. దీంతో మనస్థాపానికి గురైన డు ప్లెసిస్.. ఈ కఠిన నిర్ణయం తీసుకన్నట్లు తెలుస్తోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఉచితంగా మీ మొబైల్‌లోనే క్రెడిట్ స్కోర్ చూసుకోండిలా..
ఉచితంగా మీ మొబైల్‌లోనే క్రెడిట్ స్కోర్ చూసుకోండిలా..
రోలెక్స్ వాచ్‌పై కొత్త పంచాయితీ!
రోలెక్స్ వాచ్‌పై కొత్త పంచాయితీ!
విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే