Vijay Rashmika Marriage: ఇదెక్కడి క్రేజ్ రా బాబు.. 12 గంటల్లోనే 2 కోట్ల లైక్స్.. సోషల్ మీడియాలో విరోష్ పెళ్లి ఫోటోల హంగామా..
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన విరోష్ పెళ్లి ఫోటోస్ కనిపిస్తున్నాయి. అందులో రష్మిక, విజయ్ దేవరకొండ లుక్స్ చూసి ఫిదా అవుతున్నారు నెటిజన్స్. ఇప్పటివరకూ ఎవరు ట్రై చేయని రాయల్ లుక్ థీమ్ తో పెళ్లి చేసుకున్ని అందరిని ఆశ్చర్యపరిచారు విరోష్ జంట. బంగారు నగలతో మరింత అందంగా మెరిసిపోయారు.

టాలీవుడ్ లవబుల్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. చాలా కాలంగా ప్రేమలో ఉన్న వీరిద్దరు ఎప్పుడు తమ రిలేషన్ షిప్ గురించి గోప్యత పాటిస్తూ వచ్చారు. ఇప్పుడు ఈ జంట ఎట్టకేలకు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. ఫిబ్రవరి 26న వీరి వివాహం ఉదయ్ పూర్ లోని ఐటీసీ మెమోంటో హోటల్లో ఘనంగా జరిగింది. హిందూ సంప్రదాయం, కొడవ ఆచారల ప్రకారం వీరి వివాహ ప్రక్రియ జరిగింది. అనంతరం తమ పెళ్లి గురించి అధికారికంగా ప్రకటించారు విజయ్, రష్మిక. ఇక ఈ వీరి పెళ్లి ఫోటోస్ మాత్రం సోషల్ మీడియాలో సునామీ సృష్టించాయి. అందులో విరోష్ జంట లుక్స్ అందరినీ ఫిదా చేశాయి. అందరూ స్టార్స్ మాదిరిగా కాకుండా రాయల్ థీమ్ ఎంచుకున్నారు. ఒకప్పుడు రాజుల కాలంలో జరిగే పెళ్లి వేడుకలా.. పూర్తిగా బంగారు నగలతో రాజసం ఉట్టిపడేలా వీరిద్దరు కనిపించారు. దీంతో ఇప్పుడు నెట్టింట విరోష్ పెళ్లి ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి.
ఎక్కువ మంది చదివినవి : Folk Song: ఏం పాట భయ్యా.. కుర్రాళ్లకు పిచ్చేక్కించేసింది.. యూట్యూబ్‌ను ఊపేసిన ఫోక్ సాంగ్..
విజయ్ దేవరకొండ చేసిన పోస్టుకు కేవలం 12 గంటల్లోనే 12 మిలియన్స్ లైక్స్ రాగా.. రష్మిక పోస్టుకు 14 మిలియన్ల లైక్స్ వచ్చాయి. కేవలం 12 గంటల వ్యవధిలోనే ఈ జంట ఫోటోలకు 2.6 కోట్ల లైక్స్ రావడం విశేషం. ఇప్పుడు ఈ విషయం టాలీవుడ్ చరిత్రలోనే సరికొత్త రికార్డుగా నిలిచింది. ఈ స్థాయిలో రెస్పాన్స్ రావడం వారిద్దరి క్రేజ్ కు నిదర్శమనే చెప్పాలి. ముఖ్యంగా విరోష్ పెళ్లి ఫోటోలను.. వారిద్దరి లుక్స్ ను శివపార్వతులతో పోలుస్తూ నెటిజన్స్ కొత్త కొత్త ఫోటోస్ పంచుకుంటున్నారు.
ఎక్కువ మంది చదివినవి : Ramya Krishna : రమ్యకృష్ణ కొడుకు ఇప్పుడేం చేస్తున్నాడంటే.. మొదటిసారి తనయుడి గురించి చెప్పిన కృష్ణ వంశీ..
పెళ్లి వేడుక అనంతరం శుక్రవారం తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు విజయ్, రష్మిక. ఇదంతా పక్కన పెడితే.. విరోష్ జంట తమ ప్రేమ, బంధం గురించి ఎప్పుడూ గోప్యత పాటిస్తూ వస్తున్నారు. ఎక్కడా బహిరంగంగా మాట్లాడలేదు. దాదాపు 8 సంవత్సరాలు వీరిద్దరు తమ ప్రేమ గురించి ప్రస్తావించలేదు. ఇదివరకు చాలాసార్లు వీరి రిలేషన్ షిప్ గురించి ప్రశ్నలు ఎదురైనప్పటికీ సున్నితంగా తిరస్కరించారు.
ఎక్కువ మంది చదివినవి : Actress : ఏంట్రా బాబూ.. ఈ సీరియల్ బ్యూటీ ఇంతందంగా మారిపోయింది.. 100 పైగా సినిమాల్లో నటించింది..
View this post on Instagram
ఎక్కువ మంది చదివినవి : Actress : రాజమౌళి మాటలతో నా గుండె పగిలిపోయింది.. ఆ సినిమా వదులుకోకుండా ఉండాల్సింది.. టాలీవుడ్ హీరోయిన్..
