AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ నెల 6 నుంచి హెల్త్ వీక్.. రాష్ట్రవ్యాప్తంగా వారం రోజుల కార్యక్రమాలు

హెల్త్ వీక్‌లో ప్రతి రోజూ ప్రత్యేక థీమ్‌తో కార్యక్రమాలు నిర్వహించనున్నారు. విద్యార్థులు, మహిళలు, యువత విస్తృతంగా పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. అన్ని శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని సూచించారు. రాజనర్సింహ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి దిశానిర్దేశం చేశారు.

ఈ నెల 6 నుంచి హెల్త్ వీక్.. రాష్ట్రవ్యాప్తంగా వారం రోజుల కార్యక్రమాలు
Health
Prabhakar M
| Edited By: |

Updated on: Apr 04, 2026 | 9:06 PM

Share

ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 6 నుంచి 11వ తేదీ వరకు “హెల్త్ వీక్” నిర్వహించనుంది. ఈ సందర్భంగా నిర్వహించనున్న కార్యక్రమాలపై ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో మంత్రి దామోదర్ రాజనర్సింహ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెంచడం, ప్రభుత్వ వైద్య సేవలను మరింత చేరువ చేయడం లక్ష్యంగా కార్యక్రమాలు ఉండాలని మంత్రి సూచించారు.

హెల్త్ వీక్‌లో ప్రతి రోజూ ప్రత్యేక థీమ్‌తో కార్యక్రమాలు నిర్వహించనున్నారు. విద్యార్థులు, మహిళలు, యువత విస్తృతంగా పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. అన్ని శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని సూచించారు.

ఏప్రిల్ 6న ఫుడ్ సేఫ్టీ ఫోకస్ డే నిర్వహించనున్నారు. ఉదయం హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్ వద్ద ఈట్ రైట్ వాక్ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం నేచురోపతి హాస్పిటల్‌లో మిల్లెట్ మేళా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఫుడ్ హ్యాండ్లర్లకు శిక్షణ, స్ట్రీట్ ఫుడ్ వ్యాపారులకు సర్టిఫికేట్లు, హైజీన్ రేటింగ్ సర్టిఫికేట్ల పంపిణీ చేపట్టనున్నారు. జిల్లాల్లో కూడా ఈట్ రైట్ వాక్‌లు, ఫుడ్ రిజిస్ట్రేషన్ మేళాలు నిర్వహించనున్నారు.

ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా నిమ్స్లో అత్యాధునిక LINAC యంత్రాన్ని మంత్రి ప్రారంభించనున్నారు. అనంతరం రవీంద్రభారతిలో జరిగే కార్యక్రమంలో తెలంగాణ కేన్సర్ రిజిస్ట్రీ, ట్రామా కేర్ పాలసీ, పలు పోర్టల్స్ ప్రారంభం, అవార్డుల ప్రదానం జరగనుంది. అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్, సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు ఎంపికైన 871 మంది డాక్టర్లకు నియామక పత్రాలు అందజేయనున్నారు. తర్వాత ఎర్రగడ్డలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ భవనాన్ని ప్రారంభించనున్నారు.

ఏప్రిల్ 8న సేఫ్ మదర్ డేగా నిర్వహిస్తూ బోయిగూడలోని మిడ్‌వైఫరీ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌లో కార్యక్రమం జరుగుతుంది. జిల్లాల్లో ANC పరీక్షలు, హైరిస్క్ కేసుల గుర్తింపు, ప్రసూతి సేవలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

ఏప్రిల్ 9న ఎయిడ్స్‌పై అవగాహన కోసం రెడ్ రన్ నిర్వహించనున్నారు. జిల్లాల్లో అవగాహన ర్యాలీలు, జైళ్లలో ప్రత్యేక వైద్య శిబిరాలు, ట్రాన్స్‌జెండర్ క్లినిక్స్‌లో ఉచిత పరీక్షలు నిర్వహించనున్నారు.

ఏప్రిల్ 10న హోమియోపతి, ఆయుష్ డేగా జరుపుతూ రాష్ట్రవ్యాప్తంగా యోగా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. హోమియోపతి కళాశాలలో రాష్ట్ర స్థాయి సెమినార్ నిర్వహించనున్నారు.

ఏప్రిల్ 11న డ్రగ్స్ కంట్రోల్ రెగ్యులేటరీ స్ట్రెంథెనింగ్ డేగా నిర్వహించనున్నారు. మెడిసిన్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమాలు, గాంధీ హాస్పిటల్లో డీ అడిక్షన్ ట్రీట్మెంట్ క్యాంప్ నిర్వహించనున్నారు. విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్ పోటీలు కూడా నిర్వహించనున్నారు.

ఈ హెల్త్ వీక్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యంపై అవగాహన పెంచడం, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను మరింత చేరువ చేయడం లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

Follow Us