తెలుగు ఎలక్ట్రానిక్ మీడియాలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2012 నుండి 2017 వరకు V6 న్యూస్ ఢిల్లీ మరియు హైద్రాబాద్ రిపోర్టర్ గా పని చేసాను.. ప్రతిష్టాత్మక తెలంగాణ బిల్లు పార్లమెంట్ లో ప్రవేశ పెట్టే క్రమం నుండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు ఢిల్లీ నుండి రిపోర్టింగ్ చేశాను.. 2017లో టివి9 లో అడుగుపెట్టాను.. రెండేళ్ల పాటు హైద్రాబాద్ రిపోర్టర్ గా పనిచేసి అనంతరం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రతినిధిగా బదిలీ అయి ఐదేళ్ల పాటు గ్రౌండ్ రూరల్ నుండి రిపోర్టింగ్ చేశాను ..కామారెడ్డి జిల్లా లో గుహ లో ఇరుక్కుపోయిన రాజు అనే వ్యక్తి ని రెస్క్యూ చేయడానికి 12 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ ను కళ్లకు కడుతూ రిపోర్టింగ్ చేశాను , అందుకు గాను టీవీ9 నెట్వర్క్ నుండి బెస్ట్ పర్ఫామెన్స్ సర్టిఫికెట్ అందుకున్నాను ..2018, 2023 జనరల్ ఎన్నికల తర్వాతా ఇప్పుడు హైదరాబాద్ కు బదిలీ అయి టీవీ9 సీనియర్ కరస్పాండెంట్ గా తెలంగాణ ముఖ్యమంత్రి వ్యవహారాలు రిపోర్ట్ చేస్తున్నాను