ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చిమ్నా తండాలో గగులోతు వీరన్న ఇంట్లో జరిగిన దొంగతనం విచిత్ర మలుపు తిరిగింది. నాలుగు తులాల బంగారం, 30 తులాల వెండి, లక్షా 30 వేల రూపాయల నగదు అపహరించబడగా, మరుసటి రోజు ఉదయం దొంగిలించిన వస్తువులలో సగం (తులం బంగారం, 30 తులాల వెండి, పది వేలు నగదు) తిరిగి లభించాయి.