AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Iran Israel War: పశ్చిమాసియా ఆగమాగం! ప్రపంచదేశాల్లో గందరగోళం…

ఖమేనీ ఇరాన్‌కే కాదు, ప్రపంచానికే నియంత, అందుకే చంపేశాం అంటున్నారు ట్రంప్. ఖమేనీ అంతం కావడాన్ని మన దేశంలో చాలామంది సెలబ్రేట్ చేసుకుంటున్నారు కూడా. కానీ, ఇరాన్ మనకు శతృదేశమా, మిత్రదేశమా? ఇరాన్‌తో మనకున్న రిలేషన్‌ ఎటువంటిది? ఓ క్లారిటీకి రావాల్సిన అత్యవసర సమయం ఇది. ఇండియా నుంచి ఆఫ్ఘనిస్తాన్ వెళ్లాలన్నా, సెంట్రల్ ఏషియా వెళ్లాలన్నా, రష్యాకెళ్లాలన్నా, యూరప్ వెళ్లాలన్నా మనం ఇరాన్‌ రూట్లోనే వెళ్లాలి. ఆ లెక్కన సిరియా, ఇరాక్ లాంటి మిగతా గల్ఫ్ కంట్రీస్ కంటే ఇరానే మనకు దగ్గర. ఎమర్జెన్సీ టైమ్‌లో ముడిచమురు ఇరాన్‌ నుంచే తెచ్చుకోవచ్చు. పైగా, మన దేశానికి ఇరాన్ ఎప్పుడూ హాని తలపెట్టలేదు. అటువంటప్పుడు మనం ఇరాన్ నాశనాన్ని ఎందుకు కోరుకోవాలి? ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంలో ఇండియా ఎటువైపు? అసలీ యుద్ధంలో ఏ దేశం పాత్ర ఎంతమేరకు?

Iran Israel War:  పశ్చిమాసియా ఆగమాగం! ప్రపంచదేశాల్లో గందరగోళం...
Global Geopolitics
Ram Naramaneni
|

Updated on: Mar 02, 2026 | 10:11 PM

Share

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్.. అబూదబీ క్యాపిటల్‌గా ఏడు చిన్న రాజ్యాల కలయిక. పశ్చిమాసియాలోని తూర్పు అరేబియన్ ప్రాంతం. కోటీ పదిలక్షలకు మించని జనాభా. కానీ, ఆ జనాభాలో ఎక్కువభాగం విదేశీయులే అంటే నమ్ముతారా? ఎందుకంటే, తమ దేశంలో లేనిదేదో ఆ దేశంలో ఉందని వాళ్లంతా నమ్ముతారు. ప్రపంచంలోకెల్లా అత్యంత భద్రత కల్గిన దేశంగా భావించి, అక్కడే ఫ్యామిలీకి మకాం పెట్టి అక్కడే పిల్లలను చదివిస్తున్న మన తెలుగువాళ్లు కూడా లక్షలమంది. నిన్న దుబాయ్‌పై ఇరాన్ దాడుల తర్వాత వారి ఆలోచన పూర్తిగా మారిపోయింది. హండ్రెడ్ పర్సెంట్‌ పీస్‌కి గ్యారంటీ ఉన్న యూఏఈ ఇప్పుడు ఆ క్రెడిట్‌ను దూరం చేసుకుంది. శాంతికి స్వర్గధామమన్న పేరును చేతులారా తుడిచేసుకుంది. కేవలం గల్ఫ్‌ దేశాల్లో ఉన్న అమెరికన్ స్థావరాల్ని ధ్వంసం చేసే ప్రయత్నంలో భాగంగా అరబ్‌లో జనావాసాల్ని కూడా ఛిద్రం చేస్తోంది ఇరాన్. సో, యూఏఈ కూడా నాట్ సేఫ్ అన్నమాట. గతంలో ఏ దేశంతోనూ నేరుగా కయ్యానికి దిగిన చరిత్రే లేదు అరబ్ ఎమిరేట్స్‌కి. అటువంటి పసికూనను కూడా తన ఉక్కుకౌగిలిలో బంధించి, నెత్తుటి క్రీడలో ముంచి, ఆగమాగం చేసి వికటాట్టహాసం చేస్తోంది అమెరికా. ఇజ్రాయెల్‌ కోసం ఎందాకైనా అంటున్న అమెరికా.. 10 మిత్రదేశాలతో కలిసి ఇరాన్‌పై దండయాత్ర.. తొలిరోజే ఖమేనీని, 45 మంది మిలిటరీ టాపర్లను ఖతమార్చిన అగ్రరాజ్యం నిండా మునిగాం మాకేంటి నొప్పి.. నెల, రెండు నెలలు కాదు ఎందాకైనా తెగిస్తాం.. అమెరికాతో మాట్లాడుకోవడాల్లేవ్,...

Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి