AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాకిస్థాన్ సొంత ప్రయత్నాలు చేస్తోంది.. అమెరికాతో చర్చల ప్రసక్తే లేదుః ఇరాన్

అమెరికా, ఇరాన్‌ల మధ్య కాల్పుల విరమణ కోసం జరుగుతున్న మధ్యవర్తిత్వ ప్రయత్నాలు నిలిచిపోయాయి. షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన చర్చల్లో పాల్గొనడానికి ఇరాన్ ఖచ్చితంగా నిరాకరించిందని 'ది వాల్ స్ట్రీట్ జర్నల్' కథనం పేర్కొంది. ఆ కథనం ప్రకారం, అమెరికా, ఇరాన్‌ల మధ్య కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహించడానికి పాకిస్థాన్‌తో సహా ప్రాంతీయ దేశాలు చేస్తున్న ప్రయత్నాలు ఇప్పుడు నిష్ఫలమవుతున్నాయి.

పాకిస్థాన్ సొంత ప్రయత్నాలు చేస్తోంది.. అమెరికాతో చర్చల ప్రసక్తే లేదుః ఇరాన్
Iran Us Talks
Balaraju Goud
|

Updated on: Apr 04, 2026 | 11:33 AM

Share

అమెరికా, ఇరాన్‌ల మధ్య కాల్పుల విరమణ కోసం జరుగుతున్న మధ్యవర్తిత్వ ప్రయత్నాలు నిలిచిపోయాయి. షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన చర్చల్లో పాల్గొనడానికి ఇరాన్ ఖచ్చితంగా నిరాకరించిందని ‘ది వాల్ స్ట్రీట్ జర్నల్’ కథనం పేర్కొంది. ఆ కథనం ప్రకారం, అమెరికా, ఇరాన్‌ల మధ్య కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహించడానికి పాకిస్థాన్‌తో సహా ప్రాంతీయ దేశాలు చేస్తున్న ప్రయత్నాలు ఇప్పుడు నిష్ఫలమవుతున్నాయి.

రాబోయే రోజుల్లో ఇస్లామాబాద్‌లో అమెరికా అధికారులతో సమావేశానికి తాము సిద్ధంగా లేమని, అమెరికా డిమాండ్లను ఆమోదయోగ్యం కానివిగా భావిస్తున్నామని ఇరాన్ మధ్యవర్తులకు స్పష్టంగా చెప్పింది. “ఇస్లామాబాద్‌లో అమెరికా అధికారులతో సమావేశానికి తాము సిద్ధంగా లేమని, అమెరికా డిమాండ్లను ఆమోదయోగ్యం కానివిగా భావిస్తున్నామని ఇరాన్ అధికారికంగా మధ్యవర్తులకు చెప్పింది,” అని ఆ కథనం పేర్కొంది.

అమెరికా, ఇరాన్‌ల మధ్య చర్చలకు ఆతిథ్యం ఇచ్చేందుకు పాకిస్థాన్ గతంలో ముందుకొచ్చింది. అయితే, మధ్యవర్తిత్వ ప్రయత్నాలలో పురోగతి లేకపోవడంతో ఆ ప్రతిపాదనను ఇప్పుడు పక్కన పెట్టారు. అర్థవంతమైన చర్చలకు ఆతిథ్యం ఇచ్చి, వాటిని సులభతరం చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఇస్లామాబాద్ పేర్కొంది. అర్థవంతమైన చర్చలు జరిగితే తమ దేశం గౌరవంగా భావిస్తుందని, వాటికి మద్దతు ఇస్తుందని పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ అన్నారు. ఇదిలావుంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే పదే యూస్ – ఇరాన్‌తో చర్చలు జరుపుతోందని అంటున్నారు. “ఈ చర్చల్లో మేము చాలా మంచి పురోగతి సాధిస్తున్నాము” అని ఆయన తెలిపారు. ఆయన మరిన్ని పూర్తి వివరాలు అందించలేదు.

మరోవైపు, పాకిస్థాన్ ద్వారా జరుగుతున్న చర్చలలో తమకు ప్రమేయం లేదని ఇరాన్ స్పష్టంగా పేర్కొంది. అమెరికాతో ఎలాంటి ప్రత్యక్ష చర్చలు జరగలేదని, కేవలం అతిశయమైన, అసమంజసమైన అమెరికా డిమాండ్లు ఇతరుల ద్వారా పంపారని ఇరాన్ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ తెలిపారు. పాకిస్థాన్ తన సొంతంగా ప్రయత్నాలు చేస్తోందని, కానీ ఇరాన్‌కు ఇందులో ప్రమేయం లేదని ఆయన తేల్చి చెప్పారు. యుద్ధం ముగియడం మంచిదే అయినప్పటికీ, దానిని ఎవరు ప్రారంభించారో కూడా గుర్తుంచుకోవాలని ఆయన అన్నారు. ఇరాన్‌కు అమెరికా నుంచి 15 సూత్రాల ప్రతిపాదన అందింది, కానీ దానిని అవాస్తవికమైనది, నిరుపయోగమైనది అని తిరస్కరించింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us