మాజీ భర్త రూ.30,000 కోట్ల ఆస్తుల వివాదం.. కరిష్మా కపూర్‌కు ఊరట
ప్రముఖ వ్యాపారవేత్త సంజయ్ కపూర్ ₹30 వేల కోట్ల ఆస్తి వివాదం రాజుకుంది. ఆయన మాజీ భార్య కరిష్మా పిల్లలు, మూడో భార్య ప్రియా సచ్‌దేవ్ మధ్య వారసత్వ పోరు నడుస్తోంది. ప్రియా సచ్‌దేవ్ ఆస్తులు దాచిపెట్టి, వీలునామా ఫోర్జరీ చేశారని ఆరోపణలున్నాయి. ఆస్తులు విక్రయించవద్దని కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది, ప్రియా సచ్‌దేవను పరిరక్షించమని ఆదేశించింది.
ప్రముఖ వ్యాపారవేత్త సంజయ్ కపూర్ మరణం తరువాత ఆయన ఆస్తి విషయంలో వారసుల మధ్య వివాదం తలెత్తింది. దాదాపు 30 వేల కోట్ల రూపాయల ఆస్తుల పంపకంపై సంజయ్ మాజీ భార్య కరిష్మా కపూర్, ఆమె పిల్లలు గతేడాది కోర్టును ఆశ్రయించారు. ఆయన ఆస్తుల పూర్తి వివరాలను మూడో భార్య ప్రియ సచ్‌దేవ్ కోర్టుకు చెప్పలేదని ఆరోపించారు. సంజయ్ కపూర్, కరిష్మా పిల్లలైన కియాన్, సమైరా కపూర్‌లకు, ఆయన మూడో భార్య ప్రియా సచ్‌దేవా కపూర్ మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమనే పరిస్థితి ఉంది. సంజయ్ కపూర్ విదేశాల్లో ఉన్నప్పుడు ఫోర్జరీ చేసిన వీలునామాను ప్రియా కపూర్ సృష్టించారని కరిష్మా పిల్లలు కోర్టును ఆశ్రయించారు. అంతేకాకుండా, కోర్టుకు సమర్పించిన ఆస్తుల జాబితాలో ఖరీదైన పోలో గుర్రాలు, రోలెక్స్ వంటి లగ్జరీ వాచీలు, విలువైన పెయింటింగ్స్, స్థిరాస్తులను కావాలనే దాచి పెట్టారని వాదించారు. సంజయ్ కపూర్ ఆస్తులను విక్రయించకూడదని కోర్టు తాజాగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆస్తులను అమ్మవద్దని, పరిరక్షించాలని ఆయన మూడవ భార్య ప్రియ సచ్‌దేవాను ఆదేశించింది. సంజయ్ బ్యాంక్ ఖాతాలను ప్రియ నిర్వహించకూడదని, సంజయ్ వీలునామాపై కరిష్మా లేవనెత్తిన అనుమానాలను తొలగించాల్సిన బాధ్యత ప్రియదేనని కూడా తేల్చి చెప్పింది. సంజయ్, కరిష్మాల వివాహం 2003లో జరిగింది. సంజయ్‌కు అది రెండో పెళ్లి. ఆ జంట 2016లో విడాకులు తీసుకుంది. ఆ తరువాత సంజయ్ 2017లో ప్రియ సచ్‌దేవాను వివాహం చేసుకున్నారు. గతేడాది లండన్‌లో పోలో ఆడుతున్న సమయంలో అనుకోకుండా ఒక తేనెటీగ ఆయన గొంతులో ఇరుక్కుపోవడంతో చనిపోయారు. అయితే ఆయన చనిపోవడానికి కారణం ఓ అరుదైన కౌనిస్ సిండ్రోమ్ అని వైద్య నిపుణులు తెలిపారు. తన కొడుకు మరణంలో ఏదో అంతర్జాతీయ కుట్ర ఉందంటూ తల్లి అనుమానం వ్యక్తం చేయడంతో వివాదం చెలరేగింది. అయితే, ఆగస్టులో బ్రిటీష్ వైద్య అధికారులు ఆయన సహజ కారణాల వల్లే గుండె సంబంధిత వ్యాధితో మరణించారని ధృవీకరించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఈ ఏడాది ముందుగానే పలకరించనున్న తొలకరి
RBI షాకింగ్ నిర్ణయం.. బంగారం దాచుకున్న వారికి పండగేనా ??
రూ.1.6 కోట్ల జీతం పోగొట్టుకుని.. అప్పులతో ఇండియాకు టెకీ!
భారత్‌లో ‘పెట్రోల్’ బావులేవి ??
హిప్పోల మెడ మీద వేలాడిన కత్తి.. కొలంబియా నిర్ణయంపై అంబానీ స్పందన
రూ.1.6 కోట్ల జీతం పోగొట్టుకుని.. అప్పులతో ఇండియాకు టెకీ!
రూ. 36 లక్షల ప్యాకేజీ ఉన్నా.. పిల్లలను కనలేని పేదరికంలో ఓ జంట
మండు వేసవిలో ఇదేం పని సామీ.. అలా ఎలా చేయాలి అనిపించిందిరా
ఆపరేషన్ "ఆమ్లెట్'' పోలీసుల అండర్‌కవర్..
పెళ్లి ఊరేగింపు డీజే హోరు.. సౌండ్‌కి 140 ప్రాణాలు బలి
వైద్యుల అద్భుతం..18 నెలల చిన్నారికి లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్
చరిత్ర సృష్టించిన రితిక.. దేశంలోనే తొలి ట్రాన్స్ఉమన్ అంపైర్

