భారత్‌లో ‘పెట్రోల్’ బావులేవి ??
పశ్చిమాసియా సంక్షోభం, హెర్మూజ్ మూసివేతతో చమురు సంక్షోభం నెలకొంది. ప్రపంచంలో మూడవ అతిపెద్ద చమురు దిగుమతిదారుగా భారత్ ఉంది. దేశీయ ఉత్పత్తిని పెంచుకోవడానికి కృషి చేస్తోంది. రాజస్థాన్, గుజరాత్, అస్సాం భూభాగంలో, ముంబై హై సముద్రంలో ప్రధాన ఉత్పత్తి క్షేత్రాలు. ఇటీవల దౌత్య ప్రయత్నాలతో హెర్మూజ్ గుండా చమురు రవాణా తిరిగి ప్రారంభమైంది, ఇంధన భద్రతకు ఊరట.
పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు ఇంకా పూర్తిగా చల్లారలేదు. ముఖ్యంగా ‘హెర్మూజ్ జలసంధి’ మూతపడటంతో ప్రపంచ దేశాలలో చమురు సంక్షోభం కొనసాగుతోంది. భారీ జనాభా ఉన్న భారతదేశంలో పెట్రోలియం ఉత్పత్తులకు భారీ డిమాండ్ ఉంది. ప్రపంచవ్యాప్తంగా చమురును దిగుమతి చేసుకునే మూడవ అదిపెద్ద దేశం కూడా మనదే. దీంతో, దేశీయంగా కూడా ముడి చమురును గణనీయమైన స్థాయిలో ఉత్పత్తి చేస్తున్నారు. ఈ ఉత్పత్తి ప్రధానంగా సముద్ర గర్భంలోని ‘ఆఫ్‌షోర్’, భూభాగంలోని ‘ఆన్‌షోర్’ క్షేత్రాల నుంచి వస్తోంది. దేశంలో అతిపెద్ద చమురు క్షేత్రం ముంబై తీరంలోని ముంబై హై కాగా, పలు రాష్ట్రాలు కూడా ఈ ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. భూభాగం నుంచి ముడి చమురును అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రంగా రాజస్థాన్ నిలుస్తోంది. దేశీయ ఉత్పత్తిలో సుమారు 20-25 శాతం వాటాతో ఇది అగ్రస్థానంలో ఉంది. ఇక్కడి బార్మర్ బేసిన్‌లోని మంగళ, భాగ్యం, ఐశ్వర్య క్షేత్రాలు ప్రసిద్ధి చెందాయి. ఇక్కడ తీసిన చమురును 700 కిలోమీటర్ల ‘హీటెడ్ పైప్‌లైన్’ ద్వారా గుజరాత్‌లోని రిఫైనరీలకు తరలిస్తున్నారు. రాజస్థాన్ తర్వాత గుజరాత్, అసోం రాష్ట్రాలు కీలక ఉత్పత్తిదారులుగా ఉన్నాయి. భారతదేశంలో 1889లోనే చమురును వెలికితీసిన అత్యంత పురాతన ప్రాంతం అసోంలోని దిగ్బోయి. అలాగే అస్సాంలోని నహర్ కటియా, మొరాన్ లో కూడా చమురు బావులు ఉన్నాయి.ఈ మూడు రాష్ట్రాలు కలిపి దేశంలోని ఆన్‌షోర్ ఉత్పత్తిలో 95 శాతం వాటాను కలిగి ఉన్నాయి. గుజరాత్ లోని అంక్లేశ్వర్, కంబాత్, కలోల్, మెహసానా ప్రాంతాల్లో ముడి చమురును సేకరిస్తున్నారు. తమిళనాడులోని కావేరి బేసిన్ లో ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా-గోదావరి బేసిన్ తీర ప్రాంతాల్లో చమురు ఉన్నట్లు కనుగొన్నారు. ఇక సముద్ర గర్భంలోని (ఆఫ్‌షోర్) క్షేత్రాల విషయానికొస్తే, ముంబై హై దేశంలోనే అతిపెద్ద, అత్యంత ఉత్పాదక చమురు క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ముంబై తీరానికి పశ్చిమంగా అరేబియా సముద్రంలో 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రం, దేశ చమురు ఉత్పత్తిలో సింహభాగం అందిస్తోంది. వీటితో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా-గోదావరి (కేజీ) బేసిన్, తమిళనాడులోని కావేరీ బేసిన్, అరుణాచల్ ప్రదేశ్‌లో కూడా చమురు, సహజవాయువు నిక్షేపాలు ఉన్నాయి. ఈ ప్రాంతాల నుంచి కూడా ఉత్పత్తిని పెంచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం భారత్ దౌత్య ప్రయత్నాలు ఫలించడంతో హెర్మూజ్ నుంచి నౌకల ప్రయాణానికి అనుమతులు లభించాయి. దాంతో తాజాగా హెర్మూజ్‌ను దాటి చమురు ట్యాంకర్లు గుజరాత్‌లోని అదానీ పోర్ట్‌కు చేరుకున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
హిప్పోల మెడ మీద వేలాడిన కత్తి.. కొలంబియా నిర్ణయంపై అంబానీ స్పందన
జ్యూస్ సెంటర్లలో జ్యూస్ తాగుతున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూడండి
అందరి డౌట్స్‌ను పటాపంచలు చేసిన కింగ్
కింగ్ మేకర్ అవ్వాల్సిన హీరో.. ఫేడవుట్ అయ్యాడంటే ఆ తప్పే కారణం
రూ. 36 లక్షల ప్యాకేజీ ఉన్నా.. పిల్లలను కనలేని పేదరికంలో ఓ జంట
రూ.1.6 కోట్ల జీతం పోగొట్టుకుని.. అప్పులతో ఇండియాకు టెకీ!
రూ. 36 లక్షల ప్యాకేజీ ఉన్నా.. పిల్లలను కనలేని పేదరికంలో ఓ జంట
మండు వేసవిలో ఇదేం పని సామీ.. అలా ఎలా చేయాలి అనిపించిందిరా
ఆపరేషన్ "ఆమ్లెట్'' పోలీసుల అండర్‌కవర్..
పెళ్లి ఊరేగింపు డీజే హోరు.. సౌండ్‌కి 140 ప్రాణాలు బలి
వైద్యుల అద్భుతం..18 నెలల చిన్నారికి లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్
చరిత్ర సృష్టించిన రితిక.. దేశంలోనే తొలి ట్రాన్స్ఉమన్ అంపైర్

