AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జ్యూస్‌ సెంటర్లలో జ్యూస్‌ తాగుతున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూడండి

జ్యూస్‌ సెంటర్లలో జ్యూస్‌ తాగుతున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూడండి

Phani CH
|

Updated on: May 02, 2026 | 4:39 PM

Share

వేసవిలో జ్యూస్ సెంటర్లలోని ప్రమాదాలపై విజయనగరం ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో షాకింగ్ నిజాలు వెల్లడయ్యాయి. కుళ్ళిన పండ్లు, నాణ్యత లేని పదార్థాలు, పాత జ్యూస్‌లను కలిపి విక్రయిస్తున్నారు. బాదం మిల్క్‌లో హానికర రసాయనాలను గుర్తించారు. ఆరోగ్యం కోసం జాగ్రత్తగా ఉండాలని, పరిశుభ్రత లేని చోట్ల పానీయాలు తీసుకోకూడదని వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరిస్తోంది.

వేసవి తాపం నుంచి ఉపశమనం కోసం రోడ్డు పక్కన విక్రయించే జ్యూస్ తాగుతున్నారా? అయితే ఈ వార్త మీకోసమే. ఆరోగ్యం కోసం జ్యూస్ సెంటర్లకు వెళ్తే.. ఆసుపత్రి పాలయ్యే ప్రమాదం పొంచి ఉందని విజయనగరం జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో తేలింది. కాసుల కక్కుర్తి కోసం నిర్వాహకులు.. ప్రజల ప్రాణాలతో ఎలా చెలగాటం ఆడుతున్నారో చూసి అధికారులే అవాక్కయ్యారు. జిల్లావ్యాప్తంగా సాగుతున్న ఆకస్మిక తనిఖీల్లో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. జ్యూస్ సెంటర్లలో కుళ్లిన పండ్లు, నాణ్యత లేని ముడి పదార్థాలను వాడుతున్నట్లు అధికారులు గుర్తించారు. మరికొన్ని చోట్ల నిల్వ ఉంచిన పాత జ్యూస్‌లనే కొత్తవాటితో కలిపి కస్టమర్లకు అందిస్తున్నట్లు వెల్లడైంది. పరిశుభ్రత అన్నది మచ్చుకైనా కనిపించని ఒక జ్యూస్ సెంటర్‌ను అధికారులు తక్షణమే సీజ్ చేశారు. ముఖ్యంగా బాదం మిల్క్ ప్రియులకు ఇది పెద్ద షాక్. బాదం మిల్క్ ఎక్కువ కాలం నిల్వ ఉండటానికి, ఆకర్షణీయంగా కనిపించడానికి ఆరోగ్యానికి అత్యంత హాని కలిగించే ప్రమాదకర రసాయనాలను కలుపుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ రసాయనాల వల్ల దీర్ఘకాలంలో తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశముందని హెచ్చరించారు. తనిఖీల్లో భాగంగా కుళ్లిన పండ్లను, నిల్వ ఉంచిన పానీయాలను అధికారులు భారీగా స్వాధీనం చేసుకున్నారు. వేసవిలో వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే, బయట దొరికే పానీయాల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ సూచిస్తోంది. ఏదైనా తాగే ముందు ఆ షాపులో పరిశుభ్రతను ఒకసారి గమనించాలని, నాణ్యత లేని చోట పానీయాలు తీసుకోవద్దని హెచ్చరిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అందరి డౌట్స్‌ను పటాపంచలు చేసిన కింగ్

కింగ్‌ మేకర్ అవ్వాల్సిన హీరో.. ఫేడవుట్ అయ్యాడంటే ఆ తప్పే కారణం

రూ. 36 లక్షల ప్యాకేజీ ఉన్నా.. పిల్లలను కనలేని పేదరికంలో ఓ జంట

మండు వేసవిలో ఇదేం పని సామీ.. అలా ఎలా చేయాలి అనిపించిందిరా

పాదాల్లో వచ్చే ఈ మార్పులకు అర్థం ఏంటో తెలుసా ??

Follow Us