రూ. 36 లక్షల ప్యాకేజీ ఉన్నా.. పిల్లలను కనలేని పేదరికంలో ఓ జంట
గుర్గావ్‌లో నెలకు 3 లక్షలు సంపాదిస్తున్న జంట, పెరుగుతున్న జీవన వ్యయం, పిల్లల పెంపకం ఖర్చులు భరించలేక పిల్లల్ని కనకూడదని నిర్ణయించుకున్నారు. రియల్ ఎస్టేట్, ప్రైవేట్ స్కూల్ ఫీజుల భారం దీనికి కారణం. ఇది నగరాల్లోని 'డింక్' జంటల ఆలోచనను, సంతానోత్పత్తి రేటు తగ్గుదలను ప్రతిబింబిస్తుంది. ఆర్థిక భద్రత లేనిదే పిల్లలు వద్దు అనేది ఆధునిక యువతలో పెరుగుతున్న ధోరణి.
దేశ రాజధాని ఢిల్లీని ఆనుకుని ఉన్న ఐటీ హబ్ గుర్గావ్‌కు చెందిన ఒక జంట, నెలకు మూడు లక్షలు సంపాదిస్తున్నా.. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో తాము పిల్లల్ని కనే సాహసం చేయలేమని తేల్చి చెప్పారు. పెరుగుతున్న జీవన వ్యయం నగరాల్లోని యువత ఆలోచనా విధానాన్ని ఎలా మారుస్తుందో ఈ ఉదంతం తెలియజేస్తోంది. గుర్గావ్‌లో నివసిస్తున్న 35 ఏళ్ల వ్యక్తి నెలకు రెండు లక్షల రూపాయలు సంపాదిస్తుండగా, అతని భార్య సంపాదన నెలకు లక్ష రూపాయలు. వీరిద్దరి వార్షిక ఆదాయం 36 లక్షల రూపాయలు. ఈ జీతం చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. అయితే, పెరుగుతున్న జీవన వ్యయం, ఆకాశాన్ని అంటుతున్న నిత్యావసరాల ధరలు వారిని పిల్లలను కనకుండా అడ్డుకుంటున్నాయి. తమకంటూ గుర్గావ్‌లో వన్ బీహెచ్‌కే ఫ్లాట్ కొనే స్థోమత లేదు. అలాంటప్పుడు పుట్టబోయే బిడ్డకు తగినంత స్థలం ఎలా కల్పించగలం? అని ఆ జంట వాపోతోంది. దీనికి తోడు ప్రైవేట్ స్కూల్లో నెలకు కనీసం 35 వేల నుంచి 40 వేల రూపాయలు ఫీజుల రూపంలోనే చెల్లించాల్సి రావడం వారిని భయపెడుతోంది. రియల్ ఎస్టేట్ ధరలు, విద్యా ఖర్చుల భారం మోయలేకే వారు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తూ, పిల్లలు వద్దు అనుకునే వారిని ‘డింక్’ జంటలు అని అంటారు. ఆధునిక నగరాల్లో ఈ సంస్కృతి వేగంగా విస్తరిస్తోంది. నగరాల్లో సంతానోత్పత్తి రేటు ఎందుకు పడిపోతోందో చెప్పడానికి ఈ ఘటనే ఉదాహరణ. సోషల్ మీడియాలో ఈ పోస్ట్ వైరల్ కావడంతో నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. భవిష్యత్తుకు ఆర్థిక భద్రత ఇవ్వలేనప్పుడు పిల్లల్ని కనకపోవడమే మంచిదని కొందరు సమర్థించారు. మరికొందరు మాత్రం వయసు దాడిపోయాక ఆ జంట బాధపడక తప్పదని రాసుకొచ్చారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
భోజనం పెడితే లక్ష..భోజనం చేస్తే రూ.50 వేలు జరిమానా..ఎక్కడో తెలుసా
హైదరాబాద్ వాసులకు అలర్ట్..డిసెంబర్ నుంచి నీటి కష్టాలు తప్పవా?
చంద్రుడి పై నివాసాలు.. అణు విద్యుత్ కు ప్రయోగాలు..
రష్యాలో ప్లేగు వ్యాధి పై క్రెమ్లిన్ చెప్పిందిదే
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు

