AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ ఏడాది ముందుగానే పలకరించనున్న తొలకరి

ఈ ఏడాది ముందుగానే పలకరించనున్న తొలకరి

Phani CH
|

Updated on: May 02, 2026 | 5:48 PM

Share

దేశానికి అత్యధిక వర్షపాతాన్ని ఇచ్చే నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది ముందుగానే రానున్నాయి. ఎల్‌నినో ప్రభావం ఉన్నప్పటికీ, భారత వాతావరణ శాఖ మే చివరి వారంలోనే దక్షిణాది, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. మే 13న అండమాన్‌, 25-26న కేరళను తాకి, తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశిస్తాయి. ఈ చల్లని కబురు రైతులకు ఎంతో ఆనందాన్ని పంచుతోంది.

ఎండలు మండిపోతున్న వేళ వాతావరణ నిపుణులు చల్లని కబురు అందించారు. దేశానికి అత్యధిక వర్షపాతాన్ని ఇచ్చే నైరుతి రుతుపవనాలు.. ఈ ఏడాది ముందుగానే పలకరించబోతున్నట్టు అంచనా వేస్తున్నారు. ఎల్‌నినో ప్రభావం ఉన్నప్పటికీ.. రుతుపవనాలు తొందరగానే దేశంలోకి ప్రవేశించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించడం ఊరటనిస్తోంది. వాతావరణశాఖ అంచనా ప్రకారం.. మే నెల 13 తేదీ నాటికి రుతుపవనాలు అండమాన్‌, నికోబార్‌ దీవులను తాకే అవకాశం ఉంది. 25, 26 తేదీల్లో కేరళం తీరాన్ని తాకుతాయి. ఆ వెంటనే.. తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించనున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. దీంతో.. మే చివరి వారంలోనే దక్షిణ భారతంలో వర్షాలు ప్రారంభమయ్యే ఛాన్స్‌ ఉంది. ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో అధిక వర్షపాతం నమోదు అవుతుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. జూన్ 1కి ముందే రుతుపవనాల పలకరిస్తాయన్న ప్రకటనతో రైతులు ఖుషీ అవుతున్నారు. వాస్తవానికి.. ఎల్‌నినో ప్రభావంతో ఈసారి సాధారణం కంటే తక్కువ వర్షపాతం రికార్డ్‌ అయ్యే సూచనలు ఉన్నాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే.. ఈ ఎఫెక్ట్‌ కేవలం ఉత్తర భారతంపైనే ఉంటుందని.. దక్షిణ భారతంలో మాత్రం వర్షాలు విస్తారంగా కురుస్తాయని వాతావరణ నిపుణులు ప్రకటించారు. రుతుపవనాలపై ఎల్‌నినోతో పాటు.. హిందూ మహాసముద్రంలో ఏర్పడే ఇండియన్‌ ఓషన్‌ డైపోల్‌-IOD కూడా ప్రభావం చూపుతుందని.. ప్రస్తుతం న్యూట్రల్‌గా ఉన్న IOD పాజిటివ్‌గా మారితే అది ఎల్‌నినో తీవ్రతను తగ్గిస్తుందంటున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

RBI షాకింగ్ నిర్ణయం.. బంగారం దాచుకున్న వారికి పండగేనా ??

రూ.1.6 కోట్ల జీతం పోగొట్టుకుని.. అప్పులతో ఇండియాకు టెకీ!

భారత్‌లో ‘పెట్రోల్’ బావులేవి ??

హిప్పోల మెడ మీద వేలాడిన కత్తి.. కొలంబియా నిర్ణయంపై అంబానీ స్పందన

జ్యూస్‌ సెంటర్లలో జ్యూస్‌ తాగుతున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూడండి

Follow Us