AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జనగణన యాప్ లో భద్రాచలం.. ఏపీలో ఉన్నట్టుగా ఎందుకు చూపిస్తోంది

జనగణన యాప్ లో భద్రాచలం.. ఏపీలో ఉన్నట్టుగా ఎందుకు చూపిస్తోంది

Phani CH
|

Updated on: May 02, 2026 | 5:57 PM

Share

కేంద్రం 'స్వీయ జనగణన'లో భద్రాచలం ప్రజలకు సాంకేతిక సమస్య ఎదురైంది. యాప్‌లో భద్రాచలం తెలంగాణకు బదులు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నట్లు చూపిస్తోంది. జియో కోడింగ్ లోపాల వల్ల ప్రజలు తమ వివరాలు నమోదు చేయలేక మూడు రోజులుగా ఇబ్బంది పడుతున్నారు. అధికారులు సమస్యను గుర్తించి, రెండు రోజుల్లో పరిష్కరిస్తామని తెలిపారు. డేటా లోపాలు గణాంకాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘స్వీయ జనగణన’ ప్రక్రియలో భద్రాచలం పట్టణ ప్రజలకు వింత అనుభవం ఎదురవుతోంది. పట్టణంలోని ప్రజలు తమ వివరాలను నమోదు చేస్తుంటే, సాంకేతిక లోపాల కారణంగా భద్రాచలం పట్టణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నట్లు యాప్ చూపిస్తోంది. పట్టణ ప్రజలు తమ వివరాలు నమోదు చేసే సమయంలో జియో కోడింగ్ చేస్తుంటే.. “భద్రాచలం పట్టణం తెలంగాణ సరిహద్దుల బయట ఉంది” అనే సందేశం వస్తోంది. గత మూడు రోజులుగా ఈ సాంకేతిక సమస్య తలెత్తడంతో పట్టణ వాసులు తమ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భద్రాచలం తెలంగాణలో భాగమైనప్పటికీ, సాఫ్ట్‌వేర్ మ్యాపింగ్‌లో లోపాల వల్ల ఈ గందరగోళం నెలకొంది. ఈ సమస్యపై స్థానిక తహసీల్దార్ స్పందిస్తూ.. యాప్‌లో కొన్ని టెక్నికల్ సమస్యలు ఉన్నాయని అంగీకరించారు. “జియో ట్యాగింగ్, మ్యాపింగ్ లోపాలను ఇప్పటికే గుర్తించామని, ఈ విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. ఉన్నతాధికారులు, సాంకేతిక బృందం సమస్యను సరిచేసే పనిలో ఉన్నారని, మరో రెండు రోజుల్లో ఈ సమస్య పరిష్కారమవుతుందని, అప్పటివరకు ప్రజలు ఆందోళన చెందవద్దని ఆయన తెలిపారు. సరిహద్దు ప్రాంతాల్లోని డేటా మ్యాపింగ్‌ను సరిచేయకపోతే, గణాంకాలు తారుమారయ్యే ప్రమాదం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సమస్య త్వరగా పరిష్కారం కాకపోతే జనగణన ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఫ్యామిలీ డెత్‌ కేసులో కొత్త ట్విస్ట్‌..వారు పుచ్చకాయ వల్ల చనిపోలేదా ??

మాజీ భర్త రూ.30,000 కోట్ల ఆస్తుల వివాదం.. క‌రిష్మా క‌పూర్‌కు ఊర‌ట

ఈ ఏడాది ముందుగానే పలకరించనున్న తొలకరి

RBI షాకింగ్ నిర్ణయం.. బంగారం దాచుకున్న వారికి పండగేనా ??

రూ.1.6 కోట్ల జీతం పోగొట్టుకుని.. అప్పులతో ఇండియాకు టెకీ!

Follow Us