AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫ్యామిలీ డెత్‌ కేసులో కొత్త ట్విస్ట్‌..వారు పుచ్చకాయ వల్ల చనిపోలేదా ??

ఫ్యామిలీ డెత్‌ కేసులో కొత్త ట్విస్ట్‌..వారు పుచ్చకాయ వల్ల చనిపోలేదా ??

Phani CH
|

Updated on: May 02, 2026 | 5:55 PM

Share

మహారాష్ట్రలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మరణాలపై మిస్టరీ ఇంకా వీడలేదు. మొదట పుచ్చకాయ, బిర్యానీతో ఫుడ్ పాయిజనింగ్ అనుకున్నా, పరీక్షల్లో పుచ్చకాయకు సంబంధం లేదని తేలింది. మృతుల శరీరాల్లో 'మోర్ఫిన్' వంటి విష పదార్థాలు, అవయవాలు ఆకుపచ్చగా మారినట్లు గుర్తించారు. ఇది విషప్రయోగమేనని ఫోరెన్సిక్ నిపుణులు భావిస్తున్నారు. పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

మహారాష్ట్రలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన ఘటనపై మిస్టరీ మరింత ముదురుతోంది. బిర్యానీ, పుచ్చకాయ తిన్న కొన్ని గంటలకే వారు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారగా, తాజాగా వెలుగులోకి వచ్చిన వివరాలు కేసుకు కొత్త మలుపు తీసుకొచ్చాయి. వాళ్లు తిన్న పుచ్చకాయలో ఎలాంటి కల్తీ జరగలేదని పరీక్షల్లో తేలింది. ముంబయిలోని పైధోనీ ప్రాంతానికి చెందిన అబ్దుల్లా డొకాడియా కుటుంబం చనిపోవడానికి పుచ్చకాయకు సంబంధం లేదని తేలింది. విషం కారణంగా వారు చనిపోయినట్లు ఫోరెన్సిక్ టెస్టుల్లో బయటపడింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. మృతుల బ్రెయిన్, గుండె, పేగులు ఆకుపచ్చగా మారిపోయాయి. లక్షణాలు, అంతర్గత ఫలితాలను ఆధారంగా చేసుకుని ఇది ఫుడ్ పాయిజన్ అవ్వడానికి ఆస్కారం లేదని ఫోరెన్సిక్ వైద్యులు భావిస్తున్నారు. అబ్దుల్లా డొకాడియా శరీరంలో.. శక్తివంతమైన పెయిన్ కిల్లర్ ‘మార్ఫిన్’ ఉన్నట్లు తేలింది. మార్ఫిన్ ఓవర్ ది కౌంటర్ మెడిసిన్ కాదు. దీన్ని కొనాలంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తప్పనిసరి. మార్ఫిన్ విషయంలో ఫోరెన్సిక్ నిపుణులు, దర్యాప్తు అధికారులను అనేక సందేహాలు, అనుమానాలు వెంటాడుతున్నాయి. అబ్దుల్లా ట్రీట్‌మెంట్‌లో భాగంగా మార్ఫిన్ తీసుకుంటున్నాడా లేదా పొరపాటున ఆ డ్రగ్ తీసుకున్నాడా లేదా ఎవరైనా ఆ డ్రగ్ అతడికి ఇచ్చారా? అన్న కోణాల్లో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ మరణాలకు పుచ్చకాయకు నేరుగా ఎలాంటి సంబంధం లేదని ‘ది స్టేట్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్’ అధికారులు స్పష్టం చేశారు. వారి మరణానికి కారణం ఏంటో శాస్త్రీయంగా నిర్ధారణ అయిన తర్వాతే తుది నిర్ణయానికి రావడం జరుగుతుందని తెలిపారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. అబ్దుల్లా కుటుంబం ఏప్రిల్ 25న రాత్రి బంధువులతో కలిసి మొత్తం తొమ్మిది మంది డిన్నర్ చేశారు. వారంతా మటన్ బిర్యానీ తిన్నారు. ఐదుగురు బంధువులు తమ ఇంటికి వెళ్లిపోగా.. తెల్లవారుజామున 1.30 గంటకు భార్యాభర్తలు, వారి ఇద్దరు కుమార్తెలు నలుగురూ పుచ్చకాయ తిని నిద్రపోయారు. కానీ, కొద్ది సేపటికే వారికి వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి. ఫ్యామిలీ డాక్టర్‌ వైద్యం ఫలించకపోవడంతో జేజే ఆసుపత్రిలో చేరి.. చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. అయితే, వీరి మరణానికి పుచ్చకాయ కారణం కాదని తాజాగా తేలింది. గత వారం ముంబయిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు బిర్యానీ, పుచ్చకాయ తిని ఫుడ్ పాయిజన్ కారణంగా ప్రాణాలు కోల్పోయారనే వార్త దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ న్యూస్‌తో బిర్యానీ తిన్నాక పుచ్చకాయ తినడంపై చర్చలు మొదలయ్యాయి. మీడియాలో ఇది హాట్ టాపిక్‌గా మారితే.. ఈ ఘటనతో కొన్ని ప్రాంతాలలో వాటర్‌మిలన్ ధరలు కూడా పడిపోయాయన్న వార్త హల్ చల్ చేసింది. కానీ, వారి మరణానికి అసలు కారణం పుచ్చకాయ కాదని తేలింది. బాధితుల శరీరంలోని కొన్ని అవయవాలను ఆకుపచ్చగా మార్చిన ఒక ప్రమాదకరమైన పదార్థం అయి ఉండొచ్చని భావిస్తున్నారు. విషప్రయోగం వల్ల ఇలా జరిగి ఉండొచ్చని వైద్యుల నివేదిక సూచిస్తోంది. మొబైల్ యాక్సెసరీస్ దుకాణాన్ని నడిపే 45 ఏళ్ల అబ్దుల్లా డొకాడియా, అతడి భార్య నస్రీన్ (35), వారి ఇద్దరు పిల్లలు జైనాబ్ (13), అయేషా (16) శనివారం బంధువులతో కలిసి డిన్నర్ చేశారు. డిన్నర్‌లో వారంతా మటన్ బిర్యానీ తిన్నారు. బంధువులు వెళ్లిపోయిన తర్వాత ఆ కుటుంబం తెల్లవారుజామున సుమారు 1 గంటకు పుచ్చకాయ తిన్నారు. ఉదయం 5 గంటలకల్లా వారంతా అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలు డయేరియా లక్షణాలు కనిపించడంతో ఫుడ్ పాయిజనింగ్ జరిగిందని స్పష్టమైంది. వారు కొన్ని గంటల్లోనే మరణించారు. అయితే, తాజా నివేదికలో పుచ్చకాయలో కల్తీ జరగలేదని తేలింది. దీంతో పోలీసులు మిగతా కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మాజీ భర్త రూ.30,000 కోట్ల ఆస్తుల వివాదం.. క‌రిష్మా క‌పూర్‌కు ఊర‌ట

ఈ ఏడాది ముందుగానే పలకరించనున్న తొలకరి

RBI షాకింగ్ నిర్ణయం.. బంగారం దాచుకున్న వారికి పండగేనా ??

రూ.1.6 కోట్ల జీతం పోగొట్టుకుని.. అప్పులతో ఇండియాకు టెకీ!

భారత్‌లో ‘పెట్రోల్’ బావులేవి ??

Follow Us