AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bengal Elections: ఈసీ కీలక నిర్ణయం.. బెంగాల్‌లోని ఫాల్టా నియోజకవర్గంలో రీపోలింగ్‌కు ఆదేశం

పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఫాల్టా నియోజకవర్గంలో రీపోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సిద్ధమైంది. ఈ మేరకు ఆదేశాలు కూడా జారీ చేసింది. ఏప్రిల్ 29న జరిగిన ఎన్నికల సమయంలో తీవ్రమైన అక్రమాలు, ఎన్నికల నిబంధనల ఉల్లంఘన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ మేరకు మే 21న నియోజకవర్గ వ్యాప్తంగా రీపోలింగ్ జరుగుతుందని తెలిపింది.

Bengal Elections: ఈసీ కీలక నిర్ణయం.. బెంగాల్‌లోని ఫాల్టా నియోజకవర్గంలో రీపోలింగ్‌కు ఆదేశం
West Bengal Elections
Anand T
|

Updated on: May 02, 2026 | 11:44 PM

Share

బెంగాల్‌లోని ఫాల్టా నియోజకవర్గంలో రీపింల్‌కు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ప్రిల్ 29న జరిగిన ఎన్నికల సమయంలో తీవ్రమైన అక్రమాలు, ఎన్నికల నిబంధనల ఉల్లంఘన, ప్రజాస్వామ్య ప్రక్రియకు ఆటంకం కలిగించినట్లు ఎన్నికల సంఘం నిర్ధారించింది. ఈ నేపథ్యంలోనే గతంలో జరిగిన పోలింగ్ ప్రక్రియను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. అలాగే ఫాల్తా నియోజకవర్గ పరిధిలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ రీ-పోలింగ్ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది.

పశ్చిమ బెంగాల్‌లోని ఫాల్టా అసెంబ్లీ నియోజకవర్గంలో ఏప్రిల్ 29న పోలింగ్ రోజు జరిగిన తీవ్రమైన అవకతవకలు నేపథ్యంలో ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. పోలింగ్ రోజూ ప్రజాస్వామ్య ప్రక్రియను అపహాస్యం చేసేలా సంఘటనలు చోటుచేసుకున్నాయని భారత ఎన్నికల సంఘం నిర్ధారించింది. ఈ నేపథ్యంలోనే నియోజకవర్గంలోని మొత్తం అన్ని పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శనివారం అధికారులకు ఈసీ కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

పశ్చిమ బెంగాల్ ఫాల్టా నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ కేంద్రాంల్లో మే 21వ తేదీన రీపోలింగ్ నిర్వహించనున్నట్టు ఈసీ పేర్కొంది. నియోజవర్గ వ్యాప్తంగా సహాయక బూత్‌లతో కలిపి మొత్తం 285 పోలింగ్ కేంద్రాల్లో 21వ రోజు ఉదయం 7:00 నుండి సాయంత్రం 6:00 వరకు పోలింగ్ జరగనున్నట్టు స్పష్టం చేసింది. పోలింగ్ పూర్తైన మూడు రోజులకే అంటే మే 24న ఓట్ల లెక్కింపు ఉంటుందని తెలిపింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us