చిలకలూరిపేట సీఐ చిన్నమల్లయ్యపై ధనలక్ష్మి అనే మహిళ సంచలన ఆరోపణలు చేసింది. తనను బలవంతంగా వాడుకున్నాడని, పలువురు మహిళలతో వివాహేతర సంబంధాలు ఉన్నాయని ఆమె ఆరోపించింది. సీఐపై కఠిన చర్యలు తీసుకోవాలని, న్యాయం చేయాలని బాధితురాలు ఉన్నతాధికారులను వేడుకుంటోంది. ఈ వ్యవహారం జిల్లా పోలీస్ శాఖలో చర్చనీయాంశంగా మారింది.