ఇరాన్ యుద్ధం మధ్య నార్త్ కొరియా కీలక ప్రకటన చేసింది. ఇరాన్‌పై జరిగిన దాడిని సార్వభౌమాధికారంపై జరిగిన అక్రమ చర్యగా నార్త్ కొరియా అభివర్ణించింది. అమెరికా వైఖరిని "గ్యాంగ్‌స్టర్" లా ఉందని విమర్శిస్తూ, తన సైనిక శక్తిని దుర్వినియోగం చేస్తోందని ఆరోపించింది. ఇటువంటి చర్యలకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అమెరికాకు నార్త్ కొరియా పరోక్షంగా హెచ్చరికలు జారీ చేసింది.