వేతన జీవులకు సర్కార్ శుభవార్త.. ఉద్యోగులు, పెన్షనర్స్‌కు తీరిన కష్టాలు.. నెరవేరిన దశాబ్దాల కల..!
దశాబ్దాల తమ వాంఛను నెరవేర్చారంటూ ఉద్యోగ, పెన్షనర్స్ సంఘాల నేతలు తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగులు, పెన్షనర్లకూ రూ.1.20 కోట్ల ప్రమాద బీమా వర్తింపు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందు కోసం రూ.1,056 కోట్ల మూలనిధితో ఉద్యోగుల, పెన్షనర్ల ఆరోగ్య పథకానికి రాష్ట్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. దీంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఉద్యోగ సంఘాలు కృతజ్ఞతలు తెలిపాయి.

ఉద్యోగులకు ప్రమాద బీమా.. ఆరోగ్య పథకాలు అమలు చేసిన నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపాయి ఉద్యోగ సంఘాలు. సీఎం నివాసంలో రేవంత్‌ను కలిసి స్వయంగా కృతజ్ఞతలు తెలిపారు టీజీవో టీఎన్జీవో రెవెన్యూ ఉపాధ్యాయ పెన్షనర్ సంఘాల నేతలు. ఉద్యోగుల చిరకాల వాంఛ నెరవేర్చారంటూ ధన్యవాదాలు చెప్పారు. ఈ రెండు పథకాలు చరిత్రలో నిలిచిపోతాయని ఉద్యోగ సంఘాల నేతలు అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కేబినెట్ ఉద్యోగులు, పెన్షనర్ల ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ తీసుకున్న ఈ నిర్ణయాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిపోతాయని ఉద్యోగ సంఘాల నాయకులు కొనియాడారు. ముఖ్యమంత్రి తోపాటు మంత్రివర్గ సభ్యులకు ఉద్యోగ సంఘాల నేతలు ధన్యవాదాలు తెలిపారు.
652 గుర్తింపు పొందిన ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల్లో నగదు రహిత చికిత్సలకు అవకాశం కల్పించింది గవర్నమెంట్. 1998 వ్యాధులకు క్యాష్ లెస్ సదుపాయం కల్పించింది. దాంతో, తెలంగాణ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల జేఏసీ నేతలు సీఎంను కలిసి కృతజ్ఞతలు చెప్పారు. రేవంత్‌కు శాలువా కప్పి.. ధన్యవాదాలు తెలిపారు. పుష్పగుచ్చాలు అందించి తమ సంతోషాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నేతలతో సీఎం రేవంత్‌రెడ్డి కొద్దిసేపు ముచ్చటించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..