మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయనున్నారు. ఈ నెల 25న జగిత్యాలలో తన అనుచరులతో సమావేశమై, అదే రోజు కాంగ్రెస్ను వీడుతారని తెలుస్తోంది. ఏప్రిల్ మొదటి వారంలో ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ పరిణామం కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది.