సౌత్ ఇండస్ట్రీలోనే రిచెస్ట్ హీరోయిన్.. 40 ఏళ్ల వయసులో తగ్గని డిమాండ్

Rajitha Chanti

Pic credit - Instagram

22 March 2026

ప్రస్తుతం ఇండస్ట్రీలో కొందరు స్టార్ హీరోయిన్స్ హీరోలకు పోటీగా వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. పెళ్లై, పిల్లలున్నా చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు.

ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ హీరోయిన్ సౌత్ ఇండస్ట్రీలో రిచెస్ట్ బ్యూటీ. దక్షిణాదిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆమె వయసు 40 సంవత్సరాలు.

దాదాపు రెండు దశాబ్దాలుగా సినీరంగంలో చక్రం తిప్పుతున్న హీరోయిన్. అలాగే ఆస్తులలోనూ హీరోలకు పోటీ. ఆమె మరెవరో కాదు లేడీ సూపర్ స్టార్ నయనతార. 

కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతోనూ బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపుతుంది. ప్రస్తుతం ఆమె ఇండస్ట్రీలో అత్యంత సంపన్న హీరోయిన్.

ఆమె ఆస్తుల విషయానికి వస్తే.. నివేదికల ప్రకారం నయనతార ఆస్తులు రూ.300 కోట్లకు పైగా ఉన్నట్లు టాక్. నటిగానే కాదు.. సక్సెస్ ఫుల్ వ్యాపారవేత్త కూడా.

ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.10 కోట్లకు పైగా పారితోషికం తీసుకుంటుంది. అలాగే తన సొంత ప్రొడక్షన్ హౌస్ ద్వారా సినిమాలను నిర్మిస్తూ భారీగా లాభాలు ఆర్జిస్తున్నారు.

కేవలం సినిమాలే కాకుండా అటు కాస్మోటిక్స్ వ్యాపారంలో రాణిస్తున్నారు. మరోవైపు రియల్ ఎస్టేట్ రంగంలోనూ భారీగా పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం. 

హైదరాబాద్, చెన్నై, ముంబై వంటి ప్రధాన నగరాల్లో ఆమెకు ఖరీదైన భవంతులు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే కోట్ల విలువైన లగ్జరీ కార్లు ఉన్నట్లు సమాచారం.