తెలంగాణ ప్రభుత్వం బిల్డింగ్ రూల్స్‌లో కీలక మార్పులు చేసింది. ఇకపై 21 మీటర్లకు పైబడిన భవనాలు హైరైజ్లుగా పరిగణిస్తారు. 10 అంతస్తులకు మించిన నిర్మాణాలకు TDR (ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్) తప్పనిసరి. రోడ్డు వెడల్పును బట్టి అదనపు అంతస్తులకు అనుమతులు ఇస్తారు. రియల్ ఎస్టేట్‌లో పారదర్శకత లక్ష్యంగా ఈ కొత్త నిబంధనలు వచ్చాయి.