నల్లమల అటవీ ప్రాంతంలోని ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో పర్యాటకులకు అరుదైన పెద్దపులి దర్శనం లభించింది. కొత్త పాత గుండాల వద్ద నీరు తాగుతున్న పులిని చూసి పర్యాటకులు ఉబ్బితబ్బిబ్బయ్యారు. ఇటీవలి కాలంలో పులుల సంఖ్య పెరగడంతో నల్లమల పర్యాటకం జోష్ అందుకుంది. వన్యప్రాణి ప్రేమికులు ఈ దృశ్యాలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.