నవ్వడం కూడా తప్పేనా.. ? ట్రోల్స్‌పై బిగ్ బాస్ బ్యూటీ ఎమోషనల్..
Rajitha Chanti
Pic credit - Instagram
22 March 2026
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 ద్వారా బుల్లితెరపై మంచి గుర్తింపు తెచ్చుకుంది నటి శ్రీ సత్య. స్మాల్ స్క్రిన్ పై సీరియల్స్ చేస్తూ తెగ పాపులర్ అయ్యింది ఈ అమ్మడు.
ఇటీవల ఒక టాక్ షోలో పాల్గొని తనపై జరుగుతున్న ట్రోలింగ్, కాంట్రవర్సీలపై స్పందించింది. చిన్న విషయాలను కూడా పెద్ద వివాదాలుగా చేస్తున్నారని చెప్పుకొచ్చారు.
బిగ్ బాస్ మాత్రమే కాకుండా ఇతర షోలు కూడా పీఆర్ టీమ్స్ ద్వారా నడుస్తున్నాయని.. కంటెస్టెంట్స్ కు అనుకూలంగా కామెంట్స్ చేస్తున్నారని తెలిపింది.
ఇది ప్రేక్షకులకు గమనిస్తే సులభంగా అర్థమవుతుందని ఆమె చెప్పింది. ప్రస్తుతం శ్రీసత్య చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
లైవ్ స్ట్రీమ్ లో నేను నవ్వితే కూడా దానిని కూడా కాంట్రవర్సీగా మార్చేస్తున్నారని.. అది నా తప్పా ? తాను ఎవరి గురించి నేరుగా మాట్లాడలేదని తెలిపింది.
కేవలం నవ్వినందుకే తనను వివాదాల్లోకి లాగుతున్నారని చెప్పింది. నాకు నచ్చిన వారిని నేను సపోర్ట్ చేస్తాను. అందులో తప్పేంటీ ? అని రియాక్ట్ అయ్యింది.
గతంలో కూడా ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయని శ్రీసత్య వెల్లడించింది. బిగ్ బాస్ సమయంలో ఒక కంటెస్టెంట్ కు సపోర్ట్ చేసినందుకు ట్రోలింగ్ వచ్చిందని తెలిపింది.
ఒక ఆడపిల్లగా మరో ఆడపిల్లకు సపోర్ట్ చేయవా? అంటూ తన పై అసభ్యకరమైన కామెంట్స్ చేస్తున్నారని.. మరో కంటెస్టెంట్ కు మద్దతు తెలిపినా తప్పేనా అని అన్నారు.