సమ్మర్‌ టూర్‌ ప్లాన్‌ చేస్తున్నారా?ఈ కూల్ ప్లేస్‌లకు వెళ్లితే ఫుల్ రిలాక్స్!

22  march 2026

Jyothi Gadda

గాంగ్టక్ (సిక్కిం): ఈశాన్య భారతదేశంలోని గాంగ్టక్ ప్రకృతి సిద్ధమైన అందాలకు కేరాఫ్ అడ్రస్. ఇక్కడ నుండి కాంచన్‌జంగా పర్వత శిఖరాలను స్పష్టంగా చూడవచ్చు.

లడఖ్ (జమ్మూ కాశ్మీర్): సాహసయాత్రలు ఇష్టపడే వారికి లడఖ్ ఒక స్వర్గం. చల్లని ఎడారిగా పిలవబడే ఈ ప్రాంతంలో పంగోంగ్ సరస్సు, ఎత్తైన పర్వత శ్రేణులు కనువిందు చేస్తాయి.

మనాలి (హిమాచల్ ప్రదేశ్): హిమాలయాల అందాలకు నిలయమైన మనాలి, వేసవిలో పర్యాటకుల మొదటి ఎంపిక. ఇక్కడ రోహ్‌తంగ్ పాస్ వద్ద మంచును ఆస్వాదించవచ్చు.

మౌంట్ అబు (రాజస్థాన్): ఎడారి రాష్ట్రమైన రాజస్థాన్‌లో మౌంట్ అబు ఏకైక హిల్ స్టేషన్. ఇక్కడి నక్కీ లేక్, దిల్‌వారా దేవాలయాలు తప్పక చూడాల్సినవి.

సిమ్లా (హిమాచల్ ప్రదేశ్): బ్రిటీష్ కాలం నాటి భవనాలు, మాల్ రోడ్, చల్లని గాలులతో సిమ్లా ఎప్పుడూ పర్యాటకులతో కిటకిటలాడుతూ ఉంటుంది.

ఊటీ (తమిళనాడు): దక్షిణ భారత దేశపు హిల్ స్టేషన్ల రాణిగా పిలవబడే ఊటీ, పచ్చని లోయలు, బొటానికల్ గార్డెన్స్‌కు ప్రసిద్ధి. వేసవిలో ఇక్కడ వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది.

మున్నార్ (కేరళ): కేరళలోని ఈ ప్రాంతం తేయాకు తోటలకు ప్రసిద్ధి. వేసవిలో కూడా ఇక్కడ పొగమంచుతో నిండిన కొండలు పర్యాటకులకు కొత్త అనుభూతిని ఇస్తాయి.

మనాలి (హిమాచల్ ప్రదేశ్): హిమాలయాల అందాలకు నిలయమైన మనాలి, వేసవిలో పర్యాటకుల మొదటి ఎంపిక. ఇక్కడ రోహ్‌తంగ్ పాస్ వద్ద మంచును ఆస్వాదించవచ్చు.