జ్యోతిషం పేరుతో 58 మంది మహిళలపై అత్యాచారం
నాసిక్‌లో స్వయం ప్రకటిత జ్యోతిష్యుడు అశోక్ ఖరత్ జ్యోతిష్యం, పూజల పేరుతో మత్తుమందు ఇచ్చి 58 మంది మహిళలపై అత్యాచారం చేసినట్లు విచారణలో తేలింది. మోసపూరిత మార్గాల్లో కోట్లాది రూపాయల ఆస్తులు కూడబెట్టిన ఖరత్‌పై సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. అతని కస్టడీలో ఉండగా, మరో ముగ్గురు మహిళలు అతడిపై ఫిర్యాదు చేసేందుకు ముందుకు వచ్చారు.
నాసిక్‌లో స్వయం ప్రకటిత జ్యోతిష్యుడైన అశోక్ ఖరత్‌పై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జ్యోతిష్యం పేరుతో, పూజలు నిర్వహిస్తున్నాడనే నెపంతో మత్తుమందు ఇచ్చి 58 మంది మహిళలపై అత్యాచారం చేసినట్లు విచారణలో వెల్లడైంది. ఈ కేసులో సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం) ఏర్పాటు చేసిన తరువాత, బాధితులు ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు. కెప్టెన్ ఫైల్స్ కేసులో భాగంగా, అశోక్ ఖరత్ మోసపూరిత మార్గాల్లో కోట్లాది రూపాయల ఆస్తులను సంపాదించినట్లు తేలింది. ఇప్పటికే అతని 52 ఆస్తుల వివరాలను గుర్తించారు. నాసిక్‌లో విలాసవంతమైన బంగ్లా, కార్యాలయంతో పాటు పఠాన్‌డీలో 30 ఎకరాల భూమి, షిరిడీ విమానాశ్రయం సమీపంలో కోట్ల విలువైన భూములను కూడబెట్టినట్లు సమాచారం. అతని భూ లావాదేవీల ఏజెంట్ కూడా పోలీసుల అదుపులో ఉన్నాడు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కష్టాలు వింటా.. ఫీజు తీసుకుంటా !! ఓ వ్యక్తి వింత వ్యాపారం
మోదీజీ.. నాన్నతో ఆ అలవాటు మాన్పించండి !
ఎంత అమానవీయం !! ఫ్రెంచ్ ఫ్రైస్ ముట్టుకుందని.. పక్షిని చంపిన వ్యక్తి
దారిచ్చిన వ్యక్తికి ఏనుగు థ్యాంక్స్ చెప్పిందిలా.. గజరాజు వైరల్ వీడియో
తొమ్మిదేళ్ల నాటి రూ.10 వేల కేసు.. కట్ చేస్తే.. బ్యాంక్‌కు రూ. 3 లక్షల జరిమానా
ఆస్తులు పంచి అంత్యక్రియల ఖర్చులు అకౌంట్లో వేసి. కుటుంబం ఆత్మహత్య
ప్రాణం తీసిన బంగీజంప్.. ఏం జరిగిందంటే..
వర్క్ ఫ్రమ్ బైక్.. అంత ఆత్రం ఎందుకు బాబూ..బ్రతకాలని లేదా నీకు!
అస్థిపంజరాలు చెప్పిన లక్షల ఏళ్ల నాటి రహస్యం..
92 ఏళ్ల వయసులో 30 ఏళ్ల ఫిట్నెస్..!
అక్కడ కొండచిలువల వేట చాలా ఫేమస్!
12 రోజుల పాటు కదలని ట్రాఫిక్ జామ్.. ఎక్కడ? ఎప్పుడు?

