తొమ్మిదేళ్ల నాటి రూ.10 వేల కేసు.. కట్ చేస్తే.. బ్యాంక్‌కు రూ. 3 లక్షల జరిమానా
గుజరాత్‌లో ఓ వ్యక్తికి ఎస్‌బీఐ ఏటీఎం నుంచి డబ్బులు రాకుండానే రూ.10 వేలు డెబిట్ అయ్యాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా కస్టమర్ అయిన అతను 9 ఏళ్ల పాటు పోరాడి, వినియోగదారుల ఫోరం ద్వారా న్యాయం పొందాడు. బ్యాంక్‌కు జరిమానా విధించగా, బాధితుడికి రూ.3 లక్షలకు పైగా నష్టపరిహారం చెల్లించాలని ఫోరం ఆదేశించింది. ఏటీఎం లావాదేవీ సమస్యలపై వినియోగదారుల హక్కులకు ఇది గొప్ప విజయం.
గుజరాత్‌లో ఓ వ్యక్తి తొమ్మిదేళ్ల క్రితం ఎస్‌బీఐ ఏటీఎం నుంచి 10 వేలు విత్‌డ్రా చేయాలనుకున్నాడు. అతను బ్యాంక్ ఆఫ్ బరోడా కస్టమర్. కార్డు పెట్టి, పిన్ ఎంటర్ చేశాడు. అతనికి పదివేలు డెబిట్ అయినట్లు మెసేజ్ వచ్చింది. కానీ ఏటీఎం నుంచి క్యాష్ రాలేదు. దీంతో ఆ వ్యక్తి కంగారు పడ్డాడు. బ్యాంక్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. అతన్ని ఎవరూ పట్టించుకోలేదు. దీంతో వినియోగదారుల ఫోరమ్‌కు వెళ్లాడు. అక్కడ కేసులో వాదనలు జరిగాయి. 9 ఏళ్ల తర్వాత సమస్య పరిష్కారమైంది. బ్యాంక్ ఆఫ్ బరోడాకు జరిమానా వేశారు. ఆ కస్టమర్‌కు 3 లక్షలు చెల్లించాలని కన్జ్యూమర్ ఫోరమ్ ఆదేశించింది. 2017 ఫిబ్రవరి 18వ తేదీన సూరత్‌లోని ఓ వ్యక్తి ఎస్‌బీఐ ఏటీఎం కు 10 వేల విత్‌డ్రా కోసం వెళ్లాడు. అతను పిన్ ఎంటర్ చేసిన తర్వాత డబ్బులు కట్ అయినట్లు మెసేజ్ వచ్చింది. కానీ నగదు రాలేదు. షాక్‌కు గురైన అతను ఫిబ్రవరి 21వ తేదీన బాంక్ ఆఫ్ బరోడా దుంబల్ బ్రాంచ్‌కు వెళ్లాడు. మార్చి నుంచి మే 2017 వరకు అతను తన బ్యాంక్‌కు ఎన్నో మెయిల్స్ చేశాడు. ఓ దశలో ఆర్బీఐకి వెళ్లాడు. ఏటీఎం సెంటర్‌లోని సీసీటీవీ ఫూటేజ్‌ను పరిశీలించాలని కూడా అతను ఆర్టీఐకి రిక్వెస్ట్ పెట్టుకున్నాడు. కానీ అధికారులు పట్టించుకోలేదు. 2017 డిసెంబర్ 20వ తేదీన అతను వినియోగదారుల ఫోరమ్‌ను ఆశ్రయించాడు. ఏటీఎం ఎస్‌బీఐ బ్యాంక్‌కు చెందినదని, ట్రాన్జాక్షన్ సక్సెస్ చూపించిందని, అలాంటప్పుడు ఆ బ్యాంక్‌దే బాధ్యత అని బ్యాంక్ ఆఫ్ బరోడా వాదించింది. కానీ ఆ వాదనను వినియోగదారుల ఫోరమ్ కొట్టిపారేసింది. ఆ ట్రాన్జాక్షన్‌కు చెందిన ఆధారాలను చూపించాలని బ్యాంక్‌ను కోరింది. ఆర్బీఐ రూల్స్ ప్రకారం అయిదు రోజుల్లోనే ఆ డబ్బు కస్టమర్ ఖాతాలో జమ కావాలని కమిషన్ చెప్పింది. తన తుది తీర్పులో consumer ఫోరమ్ ఆదేశాలిస్తూ బ్యాంక్ ఆఫ్ బరోడాకు ఫైన్ వేసింది. కస్టమర్‌కు చెందిన పదివేల అమౌంట్‌పై 9 శాతం వడ్డీతో ప్రస్తుతం చెల్లించాలని ఆదేశించింది. దీంతో పాటు రోజుకు రూ.100 జరిమానా కూడా చెల్లించాలని కోరింది. 2026 ఫిబ్రవరి 26 నాటికి ఆ కస్టమర్ తన డబ్బును కోల్పోయి 3288 రోజులు అయ్యింది. దీంతో బ్యాంక్ ఆఫ్ బరోడా అతనికి కనీసం 3 లక్షల 28 వేలు చెల్లించాల్సి ఉంటుంది. మానసికంగా వేధించినందుకు మూడు వేలు, లీగల్ ఖర్చుకు రెండు వేలు కూడా చెల్లించాలని వినియోగదారుల ఫోరమ్ బ్యాంక్‌ను ఆదేశించింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అసెంబ్లీని షేక్ చేసిన ‘స్నేక్’.. బడ్జెట్ వేళ మీడియా పాయింట్‌లో పాము హల్‌చల్
బెంగళూరులో ఇంటి ఓనర్ల మోసం.. ఏం జరిగిందంటే
ఆలయంలో నాగుపాము ప్రత్యక్షం: అమ్మవారి మహిమంటూ భక్తుల పూజలు
అవతార్ లో మనిషి భూమి మీద పుట్టాడురా.. ఏం జరిగిందో తెలిస్తే షాక్..
ప్రీ వెడ్డింగ్ షూట్ లో.. పిచ్చి పీక్స్‌కు.. నెట్టింట ట్రోల్ అవుతున్న వీడియో
తొమ్మిదేళ్ల నాటి రూ.10 వేల కేసు.. కట్ చేస్తే..
అసెంబ్లీని షేక్ చేసిన 'స్నేక్'..
బెంగళూరులో ఇంటి ఓనర్ల మోసం.. ఏం జరిగిందంటే
ఆలయంలో నాగుపాము ప్రత్యక్షం: అమ్మవారి మహిమంటూ భక్తుల పూజలు
అవతార్ లో మనిషి భూమి మీద పుట్టాడురా.. ఏం జరిగిందో తెలిస్తే షాక్.
ప్రీ వెడ్డింగ్ షూట్ లో.. పిచ్చి పీక్స్‌కు..
వీడని డ్రమ్ము భయం.. భార్యలు అడిగింది ఇచ్చేస్తున్న భర్తలు

