AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆలయంలో నాగుపాము ప్రత్యక్షం: అమ్మవారి మహిమంటూ భక్తుల పూజలు

ఆలయంలో నాగుపాము ప్రత్యక్షం: అమ్మవారి మహిమంటూ భక్తుల పూజలు

Phani CH
|

Updated on: Mar 22, 2026 | 5:59 PM

Share

పండుగ వేళ మేడ్చల్ జిల్లా కీసరలోని బండ్లగూడ పోచమ్మ ఆలయంలో అద్భుతం జరిగింది. అమ్మవారి విగ్రహం ముందు నాగుపాము ప్రత్యక్షమై సుమారు నాలుగు గంటల పాటు శాంతంగా ఉంది. దీనిని అమ్మవారి మహిమగా భావించిన భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ వార్త వేగంగా వ్యాపించడంతో వేలాదిమంది తరలివచ్చారు, భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

పండుగ వేళ మేడ్చల్ జిల్లా కీసర పరిధిలోని బండ్లగూడ పోచమ్మ తల్లి ఆలయంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. గ్రామ దేవతగా కొలిచే పోచమ్మ తల్లి విగ్రహం ముందు సాక్షాత్తూ నాగరాజు ప్రత్యక్షం కావడంతో భక్తులు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. అమ్మవారి మహిమ వల్లే నాగుపాము వచ్చి దర్శనమిచ్చిందని గ్రామస్థులు పూజలు చేశారు. శుక్రవారం పండుగ సందర్భంగా ఆలయంలో అభిషేకాలు, హోమాలు ఘనంగా జరుగుతున్నాయి. మధ్యాహ్నం 12 గంటల సమయంలో పూజలు ముగిసిన వెంటనే, గర్భాలయంలోని అమ్మవారి విగ్రహం ముందు ఒక నాగుపాము ప్రత్యక్షమైంది. పడగ విప్పి శాంతంగా కూర్చున్న ఆ పామును చూసి తొలుత భక్తులు ఆశ్చర్యపోయినా, ఆ తర్వాత అది అమ్మవారి స్వరూపమేనని భావించి మొక్కులు చెల్లించుకున్నారు. సుమారు 4 గంటల పాటు అక్కడే ఉన్న పాము, సాయంత్రం 4 గంటలకు ఎవరికీ ఎలాంటి హాని చేయకుండా తనదారిన తాను వెళ్ళిపోయింది. ఈ విషయం దావానలంలా వ్యాపించడంతో మేడ్చల్, హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుండి వేలాది మంది భక్తులు ఆలయానికి పోటెత్తారు. దీంతో బండ్లగూడ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు, ఆలయ కమిటీ సభ్యులు భక్తులను నియంత్రించి దర్శనం కల్పించారు. “ఇలా జరగడం ఇది మొదటిసారి కాదు, గతంలోనూ అమ్మవారి శక్తిని చాటేలా ఇలాంటి ఘటనలు జరిగాయి” అని ఆలయ కమిటీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. వందేళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయంలో జరిగిన ఈ అద్భుత దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అవతార్ లో మనిషి భూమి మీద పుట్టాడురా.. ఏం జరిగిందో తెలిస్తే షాక్‌..

ప్రీ వెడ్డింగ్ షూట్ లో.. పిచ్చి పీక్స్‌కు.. నెట్టింట ట్రోల్ అవుతున్న వీడియో

Follow Us