AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎంత అమానవీయం !!  ఫ్రెంచ్ ఫ్రైస్ ముట్టుకుందని.. పక్షిని చంపిన వ్యక్తి

ఎంత అమానవీయం !! ఫ్రెంచ్ ఫ్రైస్ ముట్టుకుందని.. పక్షిని చంపిన వ్యక్తి

Phani CH
|

Updated on: Mar 22, 2026 | 8:13 PM

Share

అమెరికాలో ఓ వ్యక్తి ఫ్రెంచ్ ఫ్రై ముక్క కోసం సీగల్ పక్షిని దారుణంగా చంపిన ఘటనపై కోర్టు తీర్పు ఇచ్చింది. ఫ్రాంక్లిన్ జీగ్లర్‌కు 263 రోజుల జైలు, జరిమానా విధించారు. ఈ శిక్ష చాలా తక్కువని జంతు హక్కుల కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పక్షులకు ఆహారం ఇవ్వడం వాటి సహజ స్వభావాన్ని దెబ్బతీస్తుందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు, ఈ అలవాటు మానుకోవాలని సూచిస్తున్నారు.

అమెరికాలో ఓ అమానుష ఘటన జరిగింది. కేవలం ఒక ఫ్రెంచ్ ఫ్రై ముక్క కోసం ఓ వ్యక్తి… పక్షి ప్రాణం తీసాడో. తన కుమార్తె తింటున్న ఆహారాన్ని ముట్టుకోవడానికి ప్రయత్నించిందన్న కోపంతో సీగల్ పక్షిని అతి కిరాతకంగా చంపేశాడా కిరాతకుడు. ఈ కేసులో న్యాయస్థానం విచారణ జరిపి తీర్పు ఇచ్చింది, 2024 జూలైలో 30 ఏళ్ల ఫ్రాంక్లిన్ జీగ్లర్ తన కుటుంబంతో కలిసి నార్త్ వైల్డ్‌వుడ్ బీచ్‌కు వెళ్లాడు. అక్కడ అతని కుమార్తె ఫ్రెంచ్ ఫ్రైస్ తింటుండగా, ఒక సీగల్ పక్షి దానిని తీసుకునేందుకు ప్రయత్నించింది. దీంతో ఆగ్రహానికి గురైన జీగ్లర్, ఆ పక్షిని పట్టుకుని అందరూ చూస్తుండగానే దాని తల నరికి చంపేశాడు. అనంతరం, చనిపోయిన పక్షిని అక్కడి సిబ్బంది వద్దకు తీసుకెళ్లి, చెత్తబుట్టలో వేయడానికి కవర్ అడగడం అందరినీ షాక్‌కు గురిచేసింది. ఈ ఘటనపై కేసు నమోదు కాగా, విచారణ చేపట్టిన కోర్టు అతనికి 263 రోజుల జైలు శిక్ష విధించింది. ఇటీవల శిక్షాకాలం పూర్తి చేసుకుని విడుదలైన జీగ్లర్‌కు అదనంగా 250 డాలర్ల జరిమానా వేసింది. ప్రవర్తన మార్పు కోసం ప్రత్యేక రికవరీ ప్రోగ్రామ్‌లో చేరాలని కూడా ఆదేశించింది. ఈ తీర్పుపై జంతు హక్కుల కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పట్టపగలు, పిల్లల ముందు ఒక మూగజీవిని అత్యంత క్రూరంగా చంపిన వ్యక్తికి ఈ శిక్ష చాలా తక్కువని వారు వాదిస్తున్నారు. ఇది కేవలం ఒక పక్షిపై జరిగిన దాడి కాదని, సమాజంలో పెరిగిపోతున్న హింసా ప్రవృత్తికి నిదర్శనమని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీచ్‌లలో చాలా మంది అక్కడి పక్షులకు ఆహారం అందిస్తుంటారని అది అలవాటుగా మారితే పక్షుల ఉనికికే ప్రమాదం అని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. అవి సహజంగా సముద్రంలోని చేపలను వేటాడి తినే శక్తిని ఆలోచనను క్రమంగా కోల్పోతాయని కాబట్టి ఈ అలవాటు మానుకోవాలని బీచ్‌ గోయెర్స్‌కి సూచిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

దారిచ్చిన వ్యక్తికి ఏనుగు థ్యాంక్స్‌ చెప్పిందిలా.. గజరాజు వైరల్ వీడియో

తొమ్మిదేళ్ల నాటి రూ.10 వేల కేసు.. కట్‌ చేస్తే.. బ్యాంక్‌కు రూ. 3 ల‌క్ష‌ల జరిమానా

అసెంబ్లీని షేక్ చేసిన ‘స్నేక్’.. బడ్జెట్ వేళ మీడియా పాయింట్‌లో పాము హల్‌చల్

బెంగళూరులో ఇంటి ఓనర్ల మోసం.. ఏం జరిగిందంటే

ఆలయంలో నాగుపాము ప్రత్యక్షం: అమ్మవారి మహిమంటూ భక్తుల పూజలు

Follow Us