AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మోదీజీ.. నాన్నతో ఆ అలవాటు మాన్పించండి !

మోదీజీ.. నాన్నతో ఆ అలవాటు మాన్పించండి !

Phani CH
|

Updated on: Mar 22, 2026 | 8:16 PM

Share

ఇన్‌ఫ్లూయెన్సర్ యువరాజ్ దువా 'నాన్న చక్కెర తగ్గించండి' అనే సరదా అభ్యర్థనకు ప్రధాని మోదీ స్పందించారు. ఈ వీడియో వైరల్ కావడంతో, మోదీ ప్రజలకు చక్కెర వినియోగాన్ని తగ్గించుకోవాలని, యోగాను అలవరచుకోవాలని ఆరోగ్య సందేశం ఇచ్చారు. ఊబకాయం, వ్యాధుల నివారణకు ఇది అత్యవసరమని సూచిస్తూ, ప్రజారోగ్యంపై అవగాహన కల్పించారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

ఓ ఇన్‌ఫ్లూయెన్సర్‌ సరదాగా చేసిన రిక్వెస్ట్‌కి ఏకంగా ప్రధాని మోదీ స్పందించడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఏం జరిగిందంటే.. యువరాజ్ దువా అనే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్.. ‘షుగర్ కమ్ కర్వా దో పాపా కీ’ (మా నాన్నగారి చక్కెర వాడకం తగ్గించండి) అనే క్యాప్షన్‌తో ఒక ఇన్‌స్టాగ్రామ్ రీల్ పోస్ట్ చేశాడు. తన తండ్రికి ప్రధాని మోదీ అంటే విపరీతమైన అభిమానమని, ఆయన చెప్పిన మాటలను ఆదేశాలుగా భావించి పాటిస్తారని ఆ వీడియోలో సరదాగా చెప్పాడు. అందుకే ప్రధాని మోదీ స్వయంగా చెబితే తన తండ్రి చక్కెర తినడం మానేసి ఆరోగ్యకరమైన అలవాట్లను పాటిస్తారని ఆశాభావం వ్యక్తం చేశాడు. భారతదేశంలోని చాలా మంది తండ్రులకు స్నేహితులు, కుటుంబ సభ్యుల కన్నా మోదీయే ఎక్కువ ఇష్టమని, వారి ప్రేమ ర్యాంకింగ్‌లో మోదీ మొదటి స్థానంలో ఉంటారని చమత్కరించాడు. తన తండ్రి మితిమీరిన చక్కెర వాడకాన్ని నియంత్రించేందుకు సహాయం చేయాలని కోరుతూ ఆ కంటెంట్ క్రియేటర్ చేసిన వీడియో వైరల్ అయింది. ఈ వీడియో ప్రధాని దృష్టిని ఆకర్షించడంతో ఆయన దానికి ప్రతిస్పందించడమే కాకుండా ప్రజలకు ఒక ముఖ్యమైన ఆరోగ్య సందేశాన్ని కూడా ఇచ్చారు. ఈ వీడియోలోని హాస్యం, వినూత్నతకు ప్రధాని మోదీ ఆకర్షితులయ్యారు.. దానిని తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో రీ షేర్ చేశారు. అంతేకాకుండా యువరాజ్ రిక్వెస్ట్‌కి ప్రతిస్పందిస్తూ ఒక సందేశాన్ని కూడా పోస్ట్ చేశారు. “యువరాజ్ అభ్యర్థన మేరకు అతని తండ్రికి అలాగే ఇతరులందరికీ చక్కెర వాడకాన్ని తగ్గించుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఆరోగ్యంగా ఉండండి, సంతోషంగా ఉండండి” అని మోదీ అన్నారు. ఈ అవకాశాన్ని ప్రజారోగ్యంపై అవగాహన కల్పించేందుకు ప్రధాని మోదీ ఉపయోగించుకున్నారు. అధిక చక్కెర వినియోగం వల్ల అనేక వ్యాధులు వస్తాయని, స్థూలకాయం పెను ముప్పుగా పరిణమిస్తుందని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని సూచించారు. “శరీర దృఢత్వానికి, చురుకుదనానికి యోగా ఒక గొప్ప మార్గం. మీ జీవితంలో యోగాను ఒక భాగంగా చేసుకోండి” అని మోదీ తన సందేశంలో పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ తన వీడియోను షేర్ చేయడంతో యువరాజ్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. “ఇది నిజంగా నమ్మలేకపోతున్నా . ఈ వీడియో అంత దూరం వెళ్తుందని అస్సలు ఊహించలేదు” అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఈ ఘటనపై నెటిజన్లు కూడా స్పందిస్తున్నారు. “మోదీజీ స్టోరీ చూసి ఇక్కడికి వచ్చాం” అని ఒకరు, “మీ నాన్న చాలా గర్వపడతారు” అని మరొకరు కామెంట్ చేశారు. “మీ రీల్‌కు ప్రభుత్వ ఆమోదం లభించింది” అంటూ మరికొందరు యువరాజ్‌కు అభినందనలు తెలిపారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఎంత అమానవీయం !! ఫ్రెంచ్ ఫ్రైస్ ముట్టుకుందని.. పక్షిని చంపిన వ్యక్తి

దారిచ్చిన వ్యక్తికి ఏనుగు థ్యాంక్స్‌ చెప్పిందిలా.. గజరాజు వైరల్ వీడియో

తొమ్మిదేళ్ల నాటి రూ.10 వేల కేసు.. కట్‌ చేస్తే.. బ్యాంక్‌కు రూ. 3 ల‌క్ష‌ల జరిమానా

అసెంబ్లీని షేక్ చేసిన ‘స్నేక్’.. బడ్జెట్ వేళ మీడియా పాయింట్‌లో పాము హల్‌చల్

బెంగళూరులో ఇంటి ఓనర్ల మోసం.. ఏం జరిగిందంటే

Follow Us