కొత్తగా బిల్డింగ్ కడుతున్నారా ?? ఈ రూల్స్ తెలుసా ??
తెలంగాణ ప్రభుత్వం భవన నిర్మాణ నిబంధనలలో కీలక మార్పులు తీసుకొచ్చింది. TDR వినియోగంపై కొత్త మార్గదర్శకాలు, హై రైజ్ భవనాల నిర్వచనం, సెట్‌బ్యాక్‌ల సడలింపు, రోడ్డు వెడల్పును బట్టి అదనపు అంతస్తుల అనుమతులు వంటి అంశాలు ఈ కొత్త రూల్స్‌లో ప్రధానం. బిల్డింగ్ అనుమతి, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ సమయంలో TDR సమర్పణ తప్పనిసరి.
తెలంగాణ ప్రభుత్వం భవన నిర్మాణ నిబంధనలలో కీలక మార్పులను ప్రవేశపెట్టింది. ముఖ్యంగా TDR (Transferable Development Rights) వినియోగంపై కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ మార్పుల ప్రకారం, 21 మీటర్లకు పైగా ఎత్తు ఉన్న భవనాలను హై రైజ్ కేటగిరీగా గుర్తించనున్నారు. 750 నుండి 2000 చదరపు మీటర్ల ప్లాట్లలో 18-21 మీటర్ల ఎత్తు భవనాలకు TDR వినియోగం తప్పనిసరి అవుతుంది. నాన్ హై రైజ్ బిల్డింగ్స్‌కు సెట్‌బ్యాక్‌లలో సడలింపు లభించగా, హై రైజ్ భవనాలలో 10 శాతం వరకు సెట్‌బ్యాక్ రిలాక్సేషన్‌కు అనుమతి ఉంటుంది.
2000 చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న ప్లాట్లలో అదనపు అంతస్తుల నిర్మాణానికి అవకాశం కల్పించారు. దీని ప్రకారం, 40 ఫీట్ రోడ్డు వద్ద 3 అదనపు అంతస్తులు, 60 ఫీట్ రోడ్డు వద్ద 4, 80 ఫీట్ రోడ్డు వద్ద 5 అదనపు అంతస్తులకు అనుమతి లభిస్తుంది. 10 అంతస్తులకు పైబడిన భవనాల్లో TDR వినియోగం తప్పనిసరి కాగా, 20 అంతస్తులకు పైబడిన భవనాలకు 5 శాతం TDR లోడింగ్ వర్తిస్తుంది. బిల్డింగ్ అనుమతి సమయంలో 50 శాతం TDR, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌కు ముందు మిగతా 50 శాతం TDR సమర్పించాల్సి ఉంటుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Garikapati: గరికపాటి చెప్పిందేంటి ?? జనానికి అర్ధమైంది ఏంటి ??
జ్యోతిషం పేరుతో 58 మంది మహిళలపై అత్యాచారం
కష్టాలు వింటా.. ఫీజు తీసుకుంటా !! ఓ వ్యక్తి వింత వ్యాపారం
మోదీజీ.. నాన్నతో ఆ అలవాటు మాన్పించండి !
ఎంత అమానవీయం !! ఫ్రెంచ్ ఫ్రైస్ ముట్టుకుందని.. పక్షిని చంపిన వ్యక్తి
అది బస్సా లేక విమానమా? కేరళ ఆర్టీసీ లగ్జరీ ప్రయాణం!
దుబాయ్‌లో సింగిల్ రూమ్ అద్దె ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు!
అయ్యో.. అక్కడ సముద్రం ఎండిపోయిందా!
పిందె నుంచి కాయ వరకూ.. కొబ్బరికాయ తయారీలో ఆసక్తికరమైన దశలు
క్లాస్ రూంలో పాఠాలు చెబుతున్న టీచర్ అంతలోనే
బైకులోనుంచి వింత శబ్దాలు..దెబ్బకు బైకు వదిలి వ్యక్తి పరుగులు
ఏసీ కోచ్‌లో అనుమానాస్పదంగా మహిళ లగేజ్.. ఓపెన్ చేయగా చేయగా

