ఒకప్పుడు సైడ్ డాన్సర్.. ఇప్పుడు ఓ స్టార్ హీరోకి కాబోయే భార్య.. ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?
సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది ముద్దుగుమ్మలు హీరోయిన్స్ గా రాణిస్తున్నారు. టాలీవుడ్ లో ఇతర భాషల భామలు కూడా మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. అలాగే తమిళ్ ఇండస్ట్రీకి సంబంధించిన చాలా మంది భామలు టాలీవుడ్ లో సినిమాలు చేసి మెప్పిస్తున్నారు. వారిలో ఈ అమ్మడు ఒకరు.

సినిమాల్లోకి చాలా మంది కష్టపడి వచ్చిన వారే.. చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ మెయిన్ క్యారెక్టర్స్ కోసం ఏళ్లు ఎదురుచూసి ఎట్టకేలకు సక్సెస్ అయిన వారు ఎంతో మంది ఉన్నారు. హీరోలు మాత్రమే కాదు హీరోయిన్స్ కూడా ఎన్నో కష్టాలు చూసి ఇప్పుడు స్టార్స్ గా రాణిస్తున్నారు. చాలా మంది హీరోయిన్ చాలా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేశారు. మరికొంతమంది సైడ్ డాన్సర్లుగా కూడా చేశారు. స్టార్ హీరోయిన్ త్రిష, కాజల్ అగర్వాల్ లాంటి హీరోయిన్స్ కూడా కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసి ఆతర్వాత హీరోయిన్స్ గా మారి ఇప్పుడు స్టార్ హీరోలతో సమానంగా రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. ఇక పై ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్ ను గుర్తుపట్టారా.? ఆమె ఇప్పుడు చాలా ఫేమస్ హీరోయిన్. స్టార్ హీరోల సినిమాల్లో నటించి మెప్పించిది ఆ ముద్దుగుమ్మ. అంతే కాదు ఓ స్టార్ హీరోకు ఇప్పుడు కాబోయే భార్య ఆమె.. ఇంతకూ ఆమె ఎవరో గుర్తుపట్టారా.?
ఇది కూడా చదవండి :ఈ ఫొటోలో ఉన్న అన్న చెల్లెల్లు.. ఇప్పుడు టాలీవుడ్ హీరో, హీరోయిన్స్.. ఎవరో తెలుసా.?
పై ఫొటోలో కనిపిస్తున్న బ్యూటీ ఎవరో కాదు.. తన అందంతో ఎంతో మంది కుర్రాళ్లను కవ్వించినా బ్యూటీ ఆమె. ఇంతకూ ఆమె ఎవరంటే తమిళ్ బ్యూటీ సాయి ధన్సిక. ఈ ముద్దుగుమ్మ 2006 సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. తమిళ్ లో ఎన్నో సినిమాల్లో నటించింది కానీ ఆశించిన స్థాయిలో గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. కాగా ఇండస్ట్రీలోకి వచ్చిన దాదాపు 10 ఏళ్ల తర్వాత సరిగా 2016లో వచ్చిన కబాలి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన కబాలి సినిమాలో ఆయన కూతురిగా నటించింది ఈ బ్యూటీ.
ఇది కూడా చదవండి :ఒకే ఒక్క డిజాస్టర్ పడింది..! దెబ్బకు ఏడాదికి పైగా కనిపించకుండా పోయింది..
అందం అభినయం ఉన్న ధన్సికాకు అదృష్టం మాత్రం కలిసి రావడం లేదు. ఈ అమ్మడు నటించిన సినిమాలు అంతగా ఆకట్టుకోలేకపోతున్నాయి. ఇక తెలుగులో వాలుజడ, షికారు, అంతిమ తీర్పు వంటి సినిమాలు చేసింది. కానీ అంతగా క్రేజ్ రాలేదు. ఇక సోషల్ మీడియాలో ఈ బ్యూటీ షేర్ చేసే ఫోటోలకు మంచి డిమాండ్ ఉంది. నెటిజన్స్‌ను తన అందంతో ఆకట్టుకుంటుంది ఈ వయ్యారి. ఇటీవలే స్టార్ హీరో విశాల్ ను ప్రేమించి పెళ్లాడబోతుంది ఈ అమ్మడు. వీరి ఎంగేజ్మెంట్ ఇటీవలే జరిగింది. త్వరలోనే వీరు పెళ్లితో ఒక్కటవ్వబోతున్నారు.
ఇది కూడా చదవండి : బుర్రపాడు సిరీస్ బ్రో.. సీన్ సీన్‌కు ఊహించని ట్విస్ట్ లు.. ఎక్కడ చూడొచ్చంటే
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..




