హైదరాబాద్లోని మీర్పేట్లో విషాద ఘటన చోటుచేసుకుంది. పెంపుడు జంతువులపై అపారమైన ప్రేమ కలిగిన డిగ్రీ విద్యార్థిని హిమబిందు, తాను పెంచుకున్న పిల్లి హఠాత్తుగా మరణించడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యింది. ఈ దుర్ఘటనను తట్టుకోలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.