ఆ హీరో అంటే పిచ్చి.. మనసులో మాట బయట పెట్టిన కాజల్ అగర్వాల్ 

Rajeev 

20  march 2026

తెలుగు సినీప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అవసరంలేని హీరోయిన్ కాజల్ అగర్వాల్. మొదటి సినిమాతోనే నటిగా ప్రశంసలు అందుకుంది.

ఆ తర్వాత ఒక్కో సినిమాతో విజయాన్ని అందుకుంటూ తన క్రేజ్ మరింత పెంచుకుంటూ వచ్చింది.

తక్కువ సమయంలోనే స్టార్ హీరోస్ అందరి సరసన నటించి మెప్పించింది. ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలకు జోడిగా కనిపించింది.

తక్కువ సమయంలోనే నటిగా ఓ రేంజ్ క్రేజ్ సొంతం చేసుకున్న కాజల్.. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే తన ప్రియుడు గౌతమ్ కిచ్లూను పెళ్లి చేసుకుని సినిమాలకు బ్రేక్ తీసుకుంది.

ఈ దంపతులకు బాబు నీల్ కిచ్లూ జన్మించిన సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్న కాజల్.. ఇప్పుడు సరైన అవకాశాల కోసం ఎదురుచూస్తుంది.

 కాగా కాజల్ ఫేవరెట్ హీరో గురించి గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పిన కామెంట్స్ ఇప్పుడు వైరలవుతున్నాయి.

 కాజల్ కు ఇష్టమైన హీరో ఎవరు అని అడగ్గా.. ఎన్టీఆర్ అని చెప్పింది. వీరిద్దరు కలిసి ఇదివరకు రెండు సినిమాల్లో నటించారు.