AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శనివారం వెంకటేశ్వర స్వామి దీపారాధన.. ఒక్కసారి చేసేయండి, డబ్బు వర్షం!

Saturday Ritual For Wealth: శనివారం ఉదయం వెంకటేశ్వర స్వామి దీపారాధనతో అద్భుత ఫలితాలు పొందవచ్చు. స్నానమాచరించి, కర్పూరం నూనె లేదా బిళ్ళ కలిపిన నీటితో శని బాధల నుంచి ఉపశమనం పొందండి. స్వామివారి చిత్రపటాన్ని అలంకరించి, పిండి దీపం లేదా సాధారణ దీపంలో యాలక్కాయ వేసి కోరిక చెప్పుకుంటే, వారం రోజుల్లో మీ కోరికలు నెరవేరి, సంపదలు కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి.

శనివారం వెంకటేశ్వర స్వామి దీపారాధన.. ఒక్కసారి చేసేయండి, డబ్బు వర్షం!
Saturday Ritual for Wealth
Rajashekher G
|

Updated on: Mar 20, 2026 | 9:53 PM

Share

హిందూ ధర్మంలో వారంలోని ప్రతి రోజుకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంది. శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక దీపారాధన చేయడం ద్వారా అద్భుతమైన ఫలితాలు లభిస్తాయని, సంపదలు వచ్చిపడతాయని పురాణాలు, శాస్త్రాలు పేర్కొంటున్నాయి. ఈ దీపారాధనతో చేపట్టిన ప్రతి పనిలో విజయం లభిస్తుందని, కష్టాలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుందని నమ్మకం. ఈ ప్రత్యేక ఆచారాన్ని నిర్వహించడానికి కొన్ని నియమాలను పాటించాలి.

శని బాధల నుంచి విముక్తి..

శనివారం ఉదయాన్నే నిద్రలేచి ఇంటిని, పరిసరాలను శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత స్నానం చేయాలి. కొందరి జీవితాల్లో శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అలాంటి వారు శని బాధల నుండి ఉపశమనం పొందడానికి ఒక సులభమైన ఉపాయాన్ని పాటించవచ్చు. మార్కెట్లో లభించే కర్పూరం నూనెను రెండు చుక్కలు స్నానం చేసే నీటిలో కలుపుకోవాలి. ఈ కర్పూరం నూనె శని బాధలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఒకవేళ కర్పూరం నూనె దొరకకపోతే, ఒక కర్పూర బిళ్ళను తీసుకుని చేతితో మెదిపి స్నానం చేసే నీటిలో కలిపి స్నానం చేసినా అదే ఫలితం లభిస్తుంది.

పిండి దీపం..

స్నానం పూర్తయిన తర్వాత ఉతికిన శుభ్రమైన వస్త్రాలను ధరించాలి. ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని శుభ్రం చేసి, మీ దగ్గర ఉండే వివిధ రకాల పూలతో, ముఖ్యంగా తులసి దళాలతో అలంకరించాలి. తులసి దళాలు వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైనవి. అలంకరణ పూర్తయిన తర్వాత దీపారాధన చేయాలి. శనివారం చాలామంది పిండి దీపాలు వెలిగిస్తూ ఉంటారు. వెంకటేశ్వర స్వామికి పిండి దీపం చాలా ఇష్టకరమైనదిగా చెబుతారు. అయితే, పిండి దీపం చేయలేని వారు సాధారణ ప్రమిదల్లో లేదా కుందుల్లో కూడా దీపాన్ని వెలిగించవచ్చు. ఏ రకమైన దీపాన్ని వెలిగించినా పర్వాలేదు.

దీపంలో యాలక్కాయ..

దీపారాధన చేసే సమయంలో ఒక ముఖ్యమైన ఆచారాన్ని పాటించాలి. దీపంలో ఒక్క యాలక్కాయను వేయాలి. యాలకలు లక్ష్మీదేవికి ప్రీతికరమైనవని పురాణాలలో చెప్పబడింది. దీపంలో యాలక్కాయ వేసేటప్పుడు మీ మనసులో ఉన్న కోరికను, కష్టాన్ని, లేదా బాధను స్వామివారికి చెప్పుకోవాలి. పూర్తి మనస్సుతో, శ్రద్ధతో ఈ విన్నపాన్ని చేయాలి. దీపం వెలిగించిన తర్వాత అది పూర్తిగా కొండెక్కిన తర్వాత, ఆ యాలక్కాయను తీసి ఏదైనా చెట్టు మొదట్లో పడేయాలి.

పట్టిందల్లా బంగారమే..

ఈ ఆచారాన్ని శ్రద్ధగా పాటిస్తే, వారం తిరిగేసరికి మీరు కోరుకున్నది ఖచ్చితంగా జరుగుతుందని, వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో కోట్లు వచ్చి పడతాయని, జీవితంలో మిసురుడు తిరుగుతుందని, పట్టిందల్లా బంగారం అవుతుందని, అద్భుతమైన ఫలితాలు కలుగుతాయని శాస్త్ర వచనం. ఈ దీపారాధన శని దోషాల నుంచి ఉపశమనం పొందడానికి కూడా తోడ్పడుతుంది.

(Disclaimer: ఈ వార్తలోని సమాచారం మత సంబంధమైన అంశాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.)

Follow Us