AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ramyakrishna: ఇలా ఎలా తల్లి..! రమ్యకృష్ణ నటనకు దండం పెట్టాల్సిందే..

రమ్యకృష్ణ.. ఎవర్‌గ్రీన్, బ్యూటీఫుల్, సూపర్ క్యూట్.. ఇలా ఎన్ని పదాలు వాడినా.. ఆమె గురించి తక్కువ చెప్పినట్లే అవుతోంది. కేవలం అందం మాత్రమే కాదు నటన విషయంలో కూడా ఆమెకు ఆమే సాటి. రమ్యకృష్ణ పద్నాలుగు సంవత్సరాల వయసులో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ‘వెళ్ళై మనసు’ అనే చిత్రంతో తమిళ సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టారు.

Ramyakrishna: ఇలా ఎలా తల్లి..! రమ్యకృష్ణ నటనకు దండం పెట్టాల్సిందే..
Ramyakrishna
Rajeev Rayala
|

Updated on: Oct 06, 2025 | 1:27 PM

Share

తెలుగులో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించిన హీరోయిన్ రమ్యకృష్ణ. దక్షిణాది చిత్రపరిశ్రమలో లేడీ సూపర్ స్టార్ ట్యాగ్ సొంతం చేసుకున్న ఆమె తెలుగుతోపాటు తమిళం, మలయాళం భాషలలో అనేక సినిమాల్లో కనిపించింది. ఒకప్పుడు హీరోయిన్ గా అలరించిన ఆమె.. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో సహయ నటిగా రాణిస్తుంది. యంగ్ హీరోహీరోయిన్లకు తల్లిగా, అత్తగా కనిపిస్తుంది. కేవలం హీరోయిన్ గానే కాకుండా కెరీర్ పీక్స్ లో ఉండగానే నీలాంబరిగా నెగిటివ్ షేడ్స్ ఉన్న విలన్ పాత్రలో రఫ్పాడించింది. డైరెక్టర్ రాజమౌళి రూపొందించిన బాహుబలి సినిమాతో శివగామి పాత్రలో పాన్ ఇండియా అడియన్స్ హృదయాలు గెలుచుకుంది. బాహుబలి సినిమా రమ్యకృష్ణ క్రేజ్ ను మరోసారి తారాస్థాయికి చేర్చింది.

ఇది కూడా చదవండి :ఈ ఫొటోలో ఉన్న అన్న చెల్లెల్లు.. ఇప్పుడు టాలీవుడ్ హీరో, హీరోయిన్స్.. ఎవరో తెలుసా.?

బాహుబలి సినిమాలో శివగామి పాత్రలో ఆమె తప్ప మరెవ్వరూ నటించలేరు అనేలా అద్భుతంగా నటించారు రమ్యకృష్ణ. ఇదిలా ఉంటే రమ్యకృష్ణకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. బాహుబలి సినిమాను రెండు పార్ట్స్ గా తెరకెక్కించాడు రాజమౌళి. ఇప్పుడు బాహుబలి ఎపిక్ పేరుతో రీ రిలీజ్ చేయనున్నారు. రెండు పార్ట్స్ కలిపి ఒక్కటే పార్ట్ గా రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే బాహుబలి సినిమా షూటింగ్ సమయంలో రమ్యకృష్ణ సీన్‌కు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

ఇది కూడా చదవండి :ఒకే ఒక్క డిజాస్టర్ పడింది..! దెబ్బకు ఏడాదికి పైగా కనిపించకుండా పోయింది..

రమ్యకృష్ణ పార్ట్ వన్ లో అప్పుడే పుట్టిన బాహుబలిని ఎత్తుకొని సీరియస్ గా నడుచుకుంటూ వచ్చే సీన్ ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ఆ సీన్ షూటింగ్ కు సంబంధించిన వీడియోనే ఇది.. అప్పటివారకు చేతిలో ఉన్న బిడ్డతో ఆడుకుంటున్న రమ్యకృష్ణ ఒక్కసారి యాక్షన్ చెప్పగానే.. క్యారెక్టర్ లోకి దూరిపోయారు. వెంటనే సీరియస్ లుక్ లోకి మారిపోయి నడుచుకుంటూ వస్తారు. క్షణాల్లో ఆమె హావభావాలను మార్చుకోవడం నిజంగా అద్భుతం అనే చెప్పాలి. ఈ వీడియో ఇప్పుడు తెగ వైరల్ గా మారింది. రమ్యకృష్ణ సైతం ఈ వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు.

ఇది కూడా చదవండి : బుర్రపాడు సిరీస్ బ్రో.. సీన్ సీన్‌కు ఊహించని ట్విస్ట్ లు.. ఎక్కడ చూడొచ్చంటే

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
పాపం! ఆ స్టార్‌ను చూస్తుంటే బాధేస్తోంది..
పాపం! ఆ స్టార్‌ను చూస్తుంటే బాధేస్తోంది..
జబర్దస్త్ లో ఆ టీమ్ లీడర్‌ చాలా గ్రేట్.. స్కిట్ కాగానే చెక్
జబర్దస్త్ లో ఆ టీమ్ లీడర్‌ చాలా గ్రేట్.. స్కిట్ కాగానే చెక్
అమ్మ బుచ్చి.. నీకోమో 30 కోట్లు.. హీరోకేమో 100 కోట్లా..
అమ్మ బుచ్చి.. నీకోమో 30 కోట్లు.. హీరోకేమో 100 కోట్లా..
దేవతలు నిర్మించిన ఆలయం.. ఒక్క దర్శనంతో కోరికలు తీర్చే సౌమ్యనాథుడు
దేవతలు నిర్మించిన ఆలయం.. ఒక్క దర్శనంతో కోరికలు తీర్చే సౌమ్యనాథుడు
నిద్రపోతున్న సింహాన్ని లేపొద్దు.. జయం రవికి భార్య ఆర్తి కౌంటర్
నిద్రపోతున్న సింహాన్ని లేపొద్దు.. జయం రవికి భార్య ఆర్తి కౌంటర్
ప్రేమ ఒప్పుకోలేదని.. కెనెడా నుంచి వచ్చి సింగర్‌ను చంపేసిన వ్యక్తి
ప్రేమ ఒప్పుకోలేదని.. కెనెడా నుంచి వచ్చి సింగర్‌ను చంపేసిన వ్యక్తి
మోదీ-మెలోని మీటింగ్‌లో మెలోడీ వీడియో.. దూసుకెళ్లిన పార్లే షేర్!
మోదీ-మెలోని మీటింగ్‌లో మెలోడీ వీడియో.. దూసుకెళ్లిన పార్లే షేర్!
సామాన్యులకు గుడ్ న్యూస్.. రూ.5 లక్షలకు పెంపు..!
సామాన్యులకు గుడ్ న్యూస్.. రూ.5 లక్షలకు పెంపు..!
నన్ను అమ్మేసి.. బుడ్డోడిని ఎన్ని కోట్లైనా ఖర్చు చేసి కొనేస్తాడంటా
నన్ను అమ్మేసి.. బుడ్డోడిని ఎన్ని కోట్లైనా ఖర్చు చేసి కొనేస్తాడంటా
'నా కాపురంలో నిప్పులు పోసింది ఈమె!' హీరో ఆరోపణపై ఖుష్బూ రియాక్షన్
'నా కాపురంలో నిప్పులు పోసింది ఈమె!' హీరో ఆరోపణపై ఖుష్బూ రియాక్షన్