Krishna : తొలి సినిమాకే రికార్డు.. 1965లో సూపర్ స్టార్ కృష్ణ తీసుకున్న మొదటి రెమ్యునరేషన్ ఎంతంటే..
సూపర్ స్టార్ కృష్ణ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒకప్పుడు ఆయన సాహసాలకు పెట్టింది పేరు. ఎన్నో వైవిధ్యమైన కథలతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేశారు. తేనె మనసులు సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసిన ఆయన మొదటి చిత్రంతోనే అందరి దృష్టిని ఆకర్షించారు. కానీ కృష్ణ తీసుకున్న ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా.. ?

తెలుగు సినీ చరిత్రలో మెరిసిన ధ్రువతార సూపర్ స్టార్ కృష్ణ. దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో అద్భుతమైన చిత్రాలతో మెప్పించారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. తన సినీ ప్రస్థానం, తొలి పారితోషికం, పరిశ్రమలో ఎదురైన సవాళ్లు, మల్టీస్టారర్లపై తన అభిప్రాయాలను ఆ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. . నేటి తరం హీరోలు ఒకటి రెండు సినిమాలు అనుకున్న స్థాయిలో ఆడకపోతేనే నిరాశకు గురవుతున్నారని, కానీ తాను వరుసగా 14 సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదని కృష్ణ వెల్లడించారు. “నేనే సొంతంగా పాడి పంటలు తీసి సూపర్ హిట్ అయిన తర్వాత మళ్ళీ కెరియర్ నార్మల్ గా వచ్చింది” అని ఆయన గుర్తు చేసుకున్నారు. కృష్ణ గారి సినీ రంగ ప్రవేశం కూడా ఆసక్తికరంగా ఉంది. చదువు పూర్తయ్యాక స్థిరపడాలనే ఆలోచనలో ఉన్నప్పుడు “తేనె మనసులు” సినిమా కోసం పేపర్ అడ్వర్టైజ్‌మెంట్ చూసి ఫోటోలు పంపారు.
ఎక్కువ మంది చదివినవి : Gulabi Movie: ఒక్క పాటతో స్టార్ డమ్.. గులాబీ సినిమాను మిస్సైన హీరోయిన్.. ఎవరంటే..
సుబ్బారావు గారు స్వయంగా టెస్ట్ చేసి, నన్ను చూడగానే లైక్ చేసి హీరోగా ఎంపిక చేశారని కృష్ణ తెలిపారు. ఆ సమయంలో టెస్ట్ కు జయలలిత, హేమామాలిని, కృష్ణంరాజు వంటి చాలా మంది వచ్చినా, వారు ఎంపిక కాలేదని, వారు తర్వాత పెద్ద స్టార్లు అయ్యారని ఆయన గుర్తు చేసుకున్నారు. “తేనె మనసులు” చిత్రానికి గాను ఆయన అందుకున్న తొలి పారితోషికం రూ. 2000 అని స్పష్టం చేశారు. ఇప్పుడు ఒక సినిమా హిట్టయితేనే కోట్లు అడుగుతున్నారని, కానీ తాను 5000 రూపాయలకే 40-50 సినిమాలు చేశానని తెలిపారు.
ఎక్కువ మంది చదివినవి : Megastar Chiranjeevi: చిరంజీవికి భార్యగా, చెల్లిగా నటించిన ఏకైక హీరోయిన్.. 20 ఏళ్లుగా తగ్గని స్టార్ డమ్..
మల్టీస్టారర్ల విషయానికి వస్తే, తన తరంలో అలాంటి చిత్రాలకు విపరీతమైన ప్రోత్సాహం ఉండేదని, తాను రామారావు, నాగేశ్వరరావు, శోభన్ బాబు, కృష్ణంరాజు, రజినీకాంత్, శివాజీ గణేశన్ వంటి ఎంతో మంది గొప్ప నటులతో కలిసి నటించానని కృష్ణ చెప్పారు. అప్పుడు హీరోల మధ్య ఈర్ష్యలు ఉండేవి కావని, ప్రతి ఒక్కరూ తమ పాత్ర బాగుండాలని కోరుకునేవారే తప్పా, ఎదుటివారికి మంచి జరగకూడదని ఎవరూ అనుకునేవారు కాదని స్పష్టం చేశారు. పరిశ్రమలో అందరికీ పని దొరకాలనే ఉద్దేశ్యంతోనే తాను ఒక సంవత్సరంలో 18 సినిమాల వరకు చేశానని, అప్పట్లో పరిశ్రమ కూడా అంత సినిమాలు తీసిందని తెలిపారు.
ఎక్కువ మంది చదివినవి : Cinema OTT: ఏం ట్విస్టులు రా బాబూ.. ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ట్రెండింగ్లో నంబర్ వన్..
ఎక్కువ మంది చదివినవి : ఏముంటది భయ్యా ఈ సాంగ్.. చిరంజీవి, విజయశాంతి కాంబో.. థియేటర్లను ఓ ఊపు ఊపేసింది..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
