AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సీనియర్ ఎన్టీఆర్‌తో ఉన్న ఈ హీరోని గుర్తుపట్టారా.? చేసిన సినిమాలన్నీ ఫ్లాపే

సినిమా ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకోవడం అంత ఈజీ కాదు. ఎంత స్టార్ డమ్ ఉన్నా కొంతమందికి హిట్స్ రావు.. హిట్స్ లేకపోయిన క్రేజ్ తగ్గని హీరోలు చాలా మంది ఉన్నారు. ఇక సోషల్ మీడియాలో సెలబ్రెటీల ఫోటోలు నిత్యం చెక్కర్లు కొడుతున్నాయి.

సీనియర్ ఎన్టీఆర్‌తో ఉన్న ఈ హీరోని గుర్తుపట్టారా.? చేసిన సినిమాలన్నీ ఫ్లాపే
Tollywood Hero
Rajeev Rayala
|

Updated on: Oct 08, 2025 | 7:22 PM

Share

సినిమా ఇండస్ట్రీ సెలబ్రెటీల ఫోటోలకు సోషల్ మీడియాలో యమా క్రేజ్ ఉంటుంది. సమాజంలో జరిగే వాటికంటే సీలబ్రెటీల గురించే ఎక్కువగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతూ ఉంటాయి. సినిమా వాళ్ల చిన్ననాటి ఫోటోల దగ్గర నుంచి లేటెస్ట్ ఫోటోలు వరకు సోషల్ మీడియాలో లేని ఫోటో ఉండదు. ఈ క్రమంలోనే ఇప్పుడు నెట్టింట ఓ ఫోటో చక్కర్లు కొడుతుంది. యుగపురుషుడు నందమూరి తారకరామారావుకు సంబంధించిన ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది.

ఇది కూడా చదవండి : Ramyakrishna: ఇలా ఎలా తల్లి..! రమ్యకృష్ణ నటనకు దండం పెట్టాల్సిందే..

పైన పేర్కొన్న ఫోటోలో సీనియర్ ఎన్టీఆర్‌తో ఉన్న ఆ అబ్బాయి ఎవరో గుర్తుపట్టారా.? సినిమాల కంటే మిగతా విషయాల్లో సోషల్ మీడియా వేదికగా తెగ ఫేమస్ అయ్యారు. అప్పుడెప్పుడూ 21 ఏళ్ల కిందట ఓ సినిమా చేయగా.. ఇటీవలే మళ్లీ  ఓ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ఆ సినిమా మినిమమ్ కలెక్షన్లు రాబట్టలేకపోయింది. ఈపాటికి అతడెవరో మీకు గుర్తొచ్చి ఉంటుంది. ఆ నందమూరి హీరో మరెవరో కాదు.. చైతన్య కృష్ణ.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : పవన్ కళ్యాణ్‌తో డేటింగ్ చేస్తా..! సంచలన కామెంట్స్ చేసిన యంగ్ హీరోయిన్

నందమూరి చైతన్య కృష్ణ.. చాలా కాలం తర్వాత ఆమధ్య ‘బ్రీత్’ సినిమాతో థియేటర్లలో సందడి చేశారు. అయితే ఈ సినిమాకు మినిమమ్ కలెక్షన్లు కూడా రాలేదు. సీనియర్ ఎన్టీఆర్ పెద్ద కొడుకు జయకృష్ణ కుమారుడు చైతన్య కృష్ణ. సినిమాలపై ప్రేమతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన చైతన్య కృష్ణ.. 2003లో జగపతిబాబు హీరోగా వచ్చిన ‘ధమ్’ సినిమాలో ఓ కీలక పాత్ర పోషించాడు. ఆ సినిమా విడుదలైన చాలా కాలం తర్వాత మళ్లీ నటనపై ఆసక్తితో బ్రీత్ అనే సినిమా చేశాడు. కాగా, చైతన్య కృష్ణ ప్రస్తుతం రాజకీయాల్లో రాణించాలని.. తనదైన మార్క్ చూపించాలని ప్రయత్నిస్తున్నాడు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే చైతన్య కృష్ణ తాజాగా ఓ వీడియోను పంచుకున్నాడు. ఆ వీడియోలో తన తాత ఎన్టీఆర్ తో కలిసి ఉన్న ఫోటోలు ఉన్నాయి. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

ఇది కూడా చదవండి : ఒకప్పుడు సైడ్ డాన్సర్.. ఇప్పుడు ఓ స్టార్ హీరోకి కాబోయే భార్య.. ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.