AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఒకప్పుడు టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు ఎంపీగా ప్రజాసేవలో బిజీబిజీ.. ఎవరో తెలుసా?

గతంలో హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిందీ అందాల తార. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, మోహన్ బాబు, జగపతిబాబు, శ్రీకాంత్, సుమన్ తదితర స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. అయితే ఇప్పుడీ ముద్దుగుమ్మ ఎంపీగా ప్రజాసేవలో బిజి బిజీగా ఉంటోంది.

Tollywood: ఒకప్పుడు టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు ఎంపీగా ప్రజాసేవలో బిజీబిజీ.. ఎవరో తెలుసా?
Tollywood Actress
Basha Shek
|

Updated on: Oct 08, 2025 | 8:08 PM

Share

ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్లుగా ఒక వెలుగు వెలిగిన కొంతమంది అందాల తారలు ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. పెళ్లి చేసుకుని తమ పూర్తి సమయాన్ని భర్తతో, పిల్లలతోనే గడుపుతున్నారు. మరి కొంతమంది మాత్రం సెకండ్ ఇన్నింగ్స్ షురూ చేశారు. సినిమాలలో సహాయక నటులుగా మెప్పిస్తున్నారు. ఇంకొందరు హీరోయిన్లు రకరకాల వ్యాపారాలు చేసుకుంటూ మంచి బిజినెస్ వుమెన్ గా పేరు గడిస్తున్నారు. అలాగే మరికొందరు రాజకీయాల్లోనూ రాణిస్తున్నారు. ఎమ్మెల్యేగా, ఎంపీఆ ప్రజాసేవలో బిజి బిజీగా ఉంటున్నారు. ఈ టాలీవుడ్ హీరోయిన్ కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది. గతంలో ఎన్నో తెలుగు సినిమాల్లో నటించిన ఈ అందాల తార ఇప్పుడు రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తోంది. అంతేకాదు తొలి ప్రయత్నంలోనే ఎంపీగా విజయం సాధించి అందరి దృష్టిని ఆకర్షించింది. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంటు సభ్యురాలుగా పోటీ చేసిన ఆమే ఏకంగా 76,853 ఓట్ల మెజారిటీతో ప్రత్యర్థి పై విజయం సాధించింది. తొలిసారిగా ఎంపీ సభ్యురాలిగా పార్లమెంట్ లోకి అడుగు పెట్టింది.

ఇవి కూడా చదవండి

కోల్ కతాలో పుట్టి పెరిగిన ఈ హీరోయిన్ ఎక్కువగా తెలుగ సినిమాల్లోనే నటించింది. అలాగే తమిళ్, కన్నడ, ఒడియా, హిందీ భాషల్లోనూ నటించి అక్కడి ఆడియెన్స్ ను అలరించింది. తెలుగులో అయితే ఈ బ్యూటీ మెగాస్టార్ చిరంజీవి, మోహన్ బాబు, బాలకృష్ణ, జగపతిబాబు, శ్రీకాంత్ ఇలా చాలా మంది హీరోల సినిమాల్లో హీరోయిన్ గా యాక్ట్ చేసింది. అయితే సినిమాల్లో బిజీగా ఉండగానే తన సొంతూరు కోల్ కతాకు వెళ్లిపోయిన ఈ ముద్దుగుమ్మ అక్కడే సెటిలైపోయింది. సినిమాలతో పాటు టీవీ షోలతోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇదే క్రమంలో మమతా బెనర్జీ అండ దండలతో హుగ్లీ నుంచి ఎంపీగా పోటీచేసి విజయ సాధించింది. ప్రస్తుతం ప్రజాసేవలో తన పూర్తి సమయాన్ని కేటాయిస్తున్న ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్ మరెవరో కాదు రచన బెనర్జీ. అదేనండి మెగాస్టార్ చిరంజీవి నటించిన బావగారు బాగున్నారా సినిమాలో హీరోయిన్ రంభ అక్కగా నటించిన హీరోయిన్.

పార్లమెంట్ ఆవరణలో నటి రచనా బెనర్జీ..

దీదీ అండదండలతో..

రచన బెనర్జీ తెలుగులో కన్యాదానం, అభిషేకం, సుల్తాన్, రాయుడు, పవిత్ర ప్రేమ, మావిడాకులు, లాహిరి లాహిరి లాహిరిలో వంటి పలు సూపర్ హిట్ సినిమాలలో నటించింది. ఇక సినిమా కెరీర్ ఫుల్ స్పీడ్ లో ఉండగానే ప్రోబల్ బసు ను 2007లో వివాహం చేసుకుంది. ప్రస్తుతం ఈ దంపతులకు ఒక బాబు కూడా ఉన్నాడు. రచనకు పశ్చిమ బెంగాల్ లో మంచి పాపులారిటీ ఉంది. ఈ క్రమంలోనే ఎంపీగా సునాయస విజయం సాధించిందీ అందాల తార.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.