AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OG Movie In OTT: ఓటీటీలో పవన్ కల్యాణ్ బ్లాక్ బస్టర్ మూవీ ‘ఓజీ’.. ఆ సీన్స్‌తో కలిపి స్ట్రీమింగ్.. ఎప్పుడంటే?

పవన్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన తాజా చిత్రం ఓజీ. సుజిత్ తెరకెక్కించిన ఈ గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామాలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించింది. అభిమానుల భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 25న విడుదలైన ఓజీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

OG Movie In OTT: ఓటీటీలో పవన్ కల్యాణ్ బ్లాక్ బస్టర్ మూవీ 'ఓజీ'.. ఆ సీన్స్‌తో కలిపి స్ట్రీమింగ్.. ఎప్పుడంటే?
Pawan Kalyan OG Movie
Basha Shek
|

Updated on: Oct 07, 2025 | 6:21 AM

Share

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన లేటెస్ట్ సినిమా ఓజీ. సుజిత్ తెరకెక్కించిన ఈ గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామా దసరా పండగ కానుకగా సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. ఇప్పటికే రూ. 350 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. తద్వారా పవన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. స్టైలిష్ గ్యాంగ్ స్టర్ గా పవన్ కల్యాణ్ స్వాగ్, విలన్ గా ఇమ్రాన్ హష్మీ నటన, గూస్ బంప్స్ తెప్పించే యాక్షన్ సీక్వెన్స్, తమన్ బీజీఎమ్ ఓజీ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి. కాగా ఇటీవలే ఈ సినిమా టికెట్లు తగ్గించారు. దీంతో మళ్లీ ఈ మూవీ కలెక్షన్లు ఊపందుకున్నాయి. ఇప్పటివరకు ఈ సినిమా రూ. 368 కోట్ల కలెక్షన్లు సాధించినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. చాలా చోట్ల ఈ మూవీ హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో ఆడుతోంది. అయితే ఇంతలోనే ఓజీ ఓటీటీ రిలీజ్ గురించి సామాజిక మాధ్యమాల్లో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. నెల రోజుల్లోనే ఓటీటీలో విడుదల అయ్యేలా ఆ సంస్థతో ఓజీ మేకర్స్ ముందుగానే ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఒప్పందం ప్రకారం అక్టోబర్ 23 నుంచి ఓజీ సినిమా ఓటీటీలోకి స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది.

కాగా సెన్సార్ కారణంగా ఓజీ థియేట్రికల్ వెర్షన్ లో కొన్ని సీన్లకు కత్తెర పడింది. అయితే ఓటీటీ వర్షన్‌లో ఆ అదనపు సీన్లు యాడ్‌ చేస్తారని తెలుస్తోంది. అలాగే నేహా శెట్టి స్పెషల్ సాంగ్ కూడా ఉండనుందని తెలుస్తోది. అయితే ప్రస్తుతానికి ఇది కేవలం రూమర్స్ మాత్రమే. ఓజీ ఓటీటీ రిలీజ్ పై ఇంకా అధికారిక ప్రకటన రావల్సి ఉంది. డీవీవీ ఎంటర్‌ టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఓజీ మూవీలో భారీ తారాగణమే ఉంది. ప్రియాంక మోహన్‌ హీరోయిన్‌గా నటిస్తే, బాలీవుడ్ హీరో ఇమ్రాన హష్మీ స్టైలిష్ విలన్ గా అదరగొట్టాడు. శ్రియా రెడ్డి, అర్జున్‌ దాస్‌, సుహాస్, ప్రకాశ్‌ రాజ్‌, శుభలేఖ సుధాకర్, రావు రమేష్, హరీశ్ ఉత్తమన్, అభిమన్యు సింగ్, వెన్నెల కిశోర్,  వెంకట్, బిగ్ బాస్ శుభశ్రీ రాయగురు ఇలా ఎందరో స్టార్స్ ఓజీలో వివిధ పాత్రల్లో మెరిశారు. తమన్ స్వరాలు అందించాడు.

ఇవి కూడా చదవండి

అక్టోబర్ 23 నుంచి స్ట్రీమింగ్ కు ఛాన్స్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఈ ఫొటోలో ఉన్న కుర్రాడిని గుర్తుపట్టారా.?
ఈ ఫొటోలో ఉన్న కుర్రాడిని గుర్తుపట్టారా.?
మైగ్రేన్ తలనొప్పికి చెక్ పెట్టే అద్భుతమైన హెర్బల్ డ్రింక్!
మైగ్రేన్ తలనొప్పికి చెక్ పెట్టే అద్భుతమైన హెర్బల్ డ్రింక్!
ఐఫోన్‌ ధర అమెరికాలో చౌకగా ఉంటే భారత్‌లో ఎక్కువగా ఎందుకుంటుంది?
ఐఫోన్‌ ధర అమెరికాలో చౌకగా ఉంటే భారత్‌లో ఎక్కువగా ఎందుకుంటుంది?
తల్లి ఆస్తిపై కూతుళ్లకు హక్కు ఉంటుందా..?
తల్లి ఆస్తిపై కూతుళ్లకు హక్కు ఉంటుందా..?
టాస్ ఓడిన భారత్.. రెండు మార్పులతో బరిలోకి శ్రేయాస్ సేన
టాస్ ఓడిన భారత్.. రెండు మార్పులతో బరిలోకి శ్రేయాస్ సేన
రెండు ఓటీటీల్లో ట్రెండింగ్‌.. షేక్ చేస్తున్న తెలుగు మిస్టరీ థ్రిల
రెండు ఓటీటీల్లో ట్రెండింగ్‌.. షేక్ చేస్తున్న తెలుగు మిస్టరీ థ్రిల
ఇంటి పైకప్పుపై పక్షులకు ధాన్యం వేయవచ్చా?నిపుణులు ఏం చెబుతున్నారు!
ఇంటి పైకప్పుపై పక్షులకు ధాన్యం వేయవచ్చా?నిపుణులు ఏం చెబుతున్నారు!
బరువు తగ్గాలనుకునేవారికి నల్ల ఎండుద్రాక్ష మంచిదేనా?అసలు నిజం ఇదే!
బరువు తగ్గాలనుకునేవారికి నల్ల ఎండుద్రాక్ష మంచిదేనా?అసలు నిజం ఇదే!
మొక్కల్లోనూ ఆడ, మగ..? కొమ్మల్లో దాగున్న సృష్టి రహస్యం తెలిస్తే..
మొక్కల్లోనూ ఆడ, మగ..? కొమ్మల్లో దాగున్న సృష్టి రహస్యం తెలిస్తే..
పాక్‌లో రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తూన్‌ఖ్వాలో ఎమర్జెన్సీ!
పాక్‌లో రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తూన్‌ఖ్వాలో ఎమర్జెన్సీ!