AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss Telugu 9: క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలతో సంచలనం.. ఇప్పుడు బిగ్‌బాస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ.. ఎవరంటే?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో వైల్డ్ కార్డ్ ఎంట్రీలపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఇప్పటికే అగ్ని పరీక్ష నుంచి కామనర్స్ కోటాలో దివ్య నికితా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు మరికొందరు కామనర్స్, సెలబ్రిటీలు కూడా హౌస్ లోకి అడుగు పెట్టనున్నారు.

Bigg Boss Telugu 9:  క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలతో సంచలనం.. ఇప్పుడు బిగ్‌బాస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ.. ఎవరంటే?
Bigg Boss Telugu 9
Basha Shek
|

Updated on: Oct 05, 2025 | 3:01 PM

Share

బిగ్‌బాస్‌ తెలుగు సీజన్ 9 హోరా హోరీగా సాగుతోంది. సెప్టెంబర్ 07న ప్రారంభమైన ఈ రియాలిటీ షో ఇప్పటికే నాలుగో వారం ఎండింగ్ కు చేరుకుంది. మొత్తం నెల రోజుల ఆటలో ముగ్గురు కంటెస్టెంట్స్ బయటకు వెళ్లిపోగా ఈ ఆదివారం (అక్టోబర్ 05) మరొకరు ఎలిమినేట్ కానున్నారు. మరోవైపు గత సీజన్లలో మాదిరిగానే ఈసారి కూడా వైల్డ్‌ కార్ట్‌ ఎంట్రీలు ఉండనున్నాయి. ఇప్పటికే కామనర్స్‌ విభాగం నుంచి దివ్య నిఖిత హౌస్‌లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో ఐదుగురు కంటెస్టెంట్స్‌ వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ఇవ్వనున్నారుని తెలుస్తోది. వారి పేర్లు కూడా సోషల్‌మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. దివ్వెల మాధురి, అలేఖ్య చిట్టి పికిల్స్ ఫేమ్ రమ్య, సుహాసిని, కావ్య, అమర్ దీప్, ప్రభాస్‌ శీను, యూట్యూబర్ అఖిల్ రాజ్ లు హౌస్ లోకి అడుగు పెట్టనున్నారని తెలుస్తోంది. వీరితో పాటు ఒక అందాల తార పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. ఆమె మరెవరో కాదు కొన్ని రోజుల క్రితం టాలీవుడ్ దర్శకులపై క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసిన ప్రముఖ మోడల్, సోషల్ మీడియా ఇన్ ప్లూయెన్సర్ మౌనీషా చౌదరి. ప్రస్తుతం అమెరికాలో ఉంటోన్న ఆమె బిగ్ బాస్ హౌస్ లోకి రావడం ఖాయమని ప్రచారం జరుగుతోంది.

2016లో ‘మిస్ ఆసియా ఉతా’గా కిరీటం గెలుచుకుంది మౌనీషా చౌదరి. స్నో అక్కగా గుర్తింపు తెచ్చుకున్న ఆమెకు సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కొద్దిరోజుల క్రితం అమెరికా వెళ్లిన మంచు విష్ణుతో కలిసి ‘కన్నప్ప’ ప్రమోషన్స్ లోనూ పాల్గొందీ అందాల తార. అయితే ఆ మధ్యన ఓ టాలీవుడ్ బడా దర్శకుడిపై సంచలన ఆరోపణలు చేసింది మౌనీష. సినిమా అవకాశం ఇస్తానని చెప్పి తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడంటూ వాపోయింది. సదరు డైరెక్టర్ తన థైస్ సైజ్ గురించి అడిగాడని, ఆ సమయంలో ఆ ఆఫర్‌ను తిరస్కరించినప్పటికీ, ఆ డైరెక్టర్ ఇప్పుడు పెద్ద స్టార్స్‌తో పెద్ద సినిమాలు తీస్తున్నాడని పేర్కొంది. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. కాస్టింగ్ కౌచ్ గురించి మరోసారి చర్చను రేకెత్తించాయి. అయితే ఆ టాలీవుడ్ డైరెక్టర్ ఎవరో మాత్రం చెప్పలేదు మౌనీష.

ఇవి కూడా చదవండి

తమన్ తో మౌనీషా చౌదరి..

మొత్తానికి కొత్త కంటెస్టెంట్స్ హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తుండటంతో బిగ్‌బాస్‌ మరింత ఆసక్తికరంగా మారనుందని చెప్పవచ్చు. అయితే ఆ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ ఎవరో మరికొన్ని రోజుల్లో క్లారిటీ రానుంది.

మౌనిష లేటెస్ట్ ఫొటోస్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటనపై ఛార్జ్‌షీట్.. 23 మందిపై అభియోగాలు
సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటనపై ఛార్జ్‌షీట్.. 23 మందిపై అభియోగాలు
ఈ బ్యాంకులు మూతపడనున్నాయ్‌.. ప్రభుత్వం సంచలన నిర్ణయం!
ఈ బ్యాంకులు మూతపడనున్నాయ్‌.. ప్రభుత్వం సంచలన నిర్ణయం!
నెంబర్ 2 ప్రభాస్.. 4లో పవన్.. నెం. 1 అతడే..!
నెంబర్ 2 ప్రభాస్.. 4లో పవన్.. నెం. 1 అతడే..!
పదో తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు 2026 నోటిఫికేషన్
పదో తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు 2026 నోటిఫికేషన్
మీ చేతి వేళ్లు మీ భవిష్యత్‌ను చెప్తాయా.. చూపుడు వేలు ఆకారం వెనుక
మీ చేతి వేళ్లు మీ భవిష్యత్‌ను చెప్తాయా.. చూపుడు వేలు ఆకారం వెనుక
ముట్టుకుంటే మరణమే..! ప్రపంచంతో అత్యతం విషపూరితమైన పక్షిఇదేనట!
ముట్టుకుంటే మరణమే..! ప్రపంచంతో అత్యతం విషపూరితమైన పక్షిఇదేనట!
ఈ సారి సంక్రాంతి సమరం.. హీరోల మధ్య కాదండోయ్.. దర్శకుల మధ్యలో
ఈ సారి సంక్రాంతి సమరం.. హీరోల మధ్య కాదండోయ్.. దర్శకుల మధ్యలో
ప్రభాస్‌ పక్కకు వెళ్లేలా ఐకాన్‌ స్టార్ రికార్డ్‌
ప్రభాస్‌ పక్కకు వెళ్లేలా ఐకాన్‌ స్టార్ రికార్డ్‌
గుండెపోటు వచ్చే 30 నిమిషాల ముందు శరీరంలో కనిపించే 5 లక్షణాలు ఇవే
గుండెపోటు వచ్చే 30 నిమిషాల ముందు శరీరంలో కనిపించే 5 లక్షణాలు ఇవే
ఇల్లు, ఉద్యోగం, పెళ్లి.. 2026లో అదృష్టం అంటే వీరిదే!
ఇల్లు, ఉద్యోగం, పెళ్లి.. 2026లో అదృష్టం అంటే వీరిదే!