AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ఓటీటీలో రియల్ థ్రిల్లింగ్ లవ్ స్టోరీ.. ఐఎమ్‌డీబీలో టాప్ రేటింగ్ తెలుగు మూవీ.. అసలు మిస్ అవ్వొద్దు

ఆ మధ్యన బేబీ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా యూత్ ఈ సినిమాను ఎగబడి చూశారు. అలాంటి ప్రేమకథా చిత్రం ఒకటి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ లవ్ స్టోరీని తెరకెక్కించారు.

OTT Movie: ఓటీటీలో రియల్ థ్రిల్లింగ్ లవ్ స్టోరీ.. ఐఎమ్‌డీబీలో టాప్ రేటింగ్ తెలుగు మూవీ.. అసలు మిస్ అవ్వొద్దు
OTT Movie
Basha Shek
|

Updated on: Oct 04, 2025 | 6:40 AM

Share

ఈ మధ్యన నిజ జీవిత సంఘటనలు, వ్యక్తుల ఆధారంగా సినిమాలు, వెబ్ సిరీస్ లు తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఆడియెన్స్ కూడా వీటిని చూసేందుకు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ముఖ్యంగా ఓటీటీల్లో ఈ రియల్ స్టోరీలకు మంచి ఆదరణ ఉంటోంది. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా కూడా ఒక రియల్ స్టోరీనే. గతేడాది ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. తెలుగుతో పాటు త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమాను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఐఎమ్ డీబీలోనూ దాదాపు 8 రేటింగ్ తో ఈ సినిమా ఉంది.బస్తీ నేపథ్యంలో సాగే ఒక ఆసక్తికర ప్రేమకథా చిత్రమిది.యువతలో చాలామంది నిజమైన ప్రేమకు, ఆకర్షణకు తేడా తెలియకుండా తప్పటడుగులు వేస్తుంటారు. ఇది వారి జీవితాలను ఎలాంటి ప్రమాదంలోకి నెట్టుతోందన్న నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. పాఠశాల నుంచి కాలేజీ స్థాయిలో ఉండే లవ్ స్టోరీలు.. వాటి వల్ల చదువుల్ని నిర్లక్ష్యం చేయడంతో వచ్చే నష్టాలు, తెలియని వయసులో ప్రేమిస్తే ఎదురయ్యే పరిణామాలను కళ్లకు కట్టినట్లు ఈ సినిమాలో చూపించారు.

లాలస అనే అమ్మాయి కమల్ అనే అబ్బాయితో ప్రేమలో పడుతుంది. అలాగే సారస్ అనే మరో అబ్బాయిని కూడా ప్రేమిస్తుంది. కమల్ , సారస్ ఇద్దరు కూడా లాలస నీ గాఢంగా ప్రేమిస్తారు. లాలస కూడా ఇద్దరితో చాలా చనువుగా ఉంటుంది. ఇద్దరినీ ఇష్టపడుతుంది. మరి చివరికి లాలస కమల్ వైపు మొగ్గు చూపిందా ? సారాస్ వైపు మొగ్గు చూపిందా ? వీరి ప్రేమకథతో ఇంకెన్ని ట్విస్టులు జరిగాయో తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

ఈ సినిమాపేరు ప్రేమించొద్దు. శిరిన్‌ శ్రీరామ్ తెరకెక్కించిన ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీలో అనురూప్, దేవమలిషెట్టి, సోనాలి గార్జే, సారిక, మానస, లహరి, యశ్వంత్ పెండ్యాల, సంతోషి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ప్రస్తుతం ఈ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ అమెజాన్ ప్రైమ్‌తో పాటు బీసినీట్ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.\

అమెజాన్ ప్రైమ్  వీడియోలో స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత