AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 9 Telugu: ఒక్కొక్కరికి చుక్కలు చూపించిన నాగార్జున..  చివరకు ట్విస్ట్.. ఆ కంటెస్టెంట్స్ డైరెక్ట్ నామినేట్..

బిగ్ బాస్ సీజన్ 9 నాలుగో వారం ఎలిమినేషన్ సమయం దగ్గరపడింది. ఈవారం హౌస్ నుంచి మరో కంటెస్టెంట్ బయటకు వెళ్లనున్నారు. ఇక శనివారం నాటి ఎపిసోడ్ లో హోస్ట్ నాగార్జున కంటెస్టెంట్లకు చుక్కలు చూపించారు. స్టార్స్ ఇస్తూనే వాళ్ల తప్పుల గురించి చెప్పుకొచ్చారు.

Bigg Boss 9 Telugu: ఒక్కొక్కరికి చుక్కలు చూపించిన నాగార్జున..  చివరకు ట్విస్ట్.. ఆ కంటెస్టెంట్స్ డైరెక్ట్ నామినేట్..
Bigg Boss 9
Rajitha Chanti
|

Updated on: Oct 05, 2025 | 7:53 AM

Share

బిగ్ బాస్ సీజన్ 9.. నాలుగో వారం ఎలిమినేషన్ పై ఆసక్తి నెలకొంది. ఈసారి కామనర్స్ నుంచి హరీష్ ఎలిమినేట్ అయ్యాడని సమాచారం. మరోవైపు శనివారం నాటి ఎపిసోడ్ లో హౌస్మేట్స్ కు చుక్కలు చూపించాడు నాగ్. ఒక్కొక్కరి స్టార్స్ ఇస్తునే గట్టిగానే గడ్డి పెట్టాడు.. హౌస్మేట్ ఆట తీరు గురించి చెబుతూ.. మంచిగా ఆడే వాళ్లకు సపోర్ట్ చేశారు. అలాగే ఆడలేకపోతున్న వారికి డైరెక్ట్ సలహాలు ఇచ్చారు. ముఖ్యంగా నిన్నటి ఎపిసోడ్ లో సంజనా సింపతి డ్రామాను.. చిలిపి పనులు అంటే చేసే దొంగతనాలకు సరైన శిక్ష వేశారు. ఆమె చేసిన పనులకు పన్మిష్మెంట్ ఇచ్చారు. ఆ తర్వాత కెప్టెన్ రాముపై ప్రశంసలు కురిపించారు. ఆ తర్వాత మాస్క్ మాన్ హరీష్ నుంచి అసలు ఆట షూరు చేశారు. మీ ఫేవరేట్ బీమ్ బ్యాగ్ వెయిట్ చేస్తుంది. దానిపై కూర్చుని సేద తీరండి. మీ కోసం వెయిట్ చేస్తుంది. మేం మాట్లాడుకుంటాం లే.. మీరు వెళ్లిపోండి.. హౌస్ లో ఏం జరిగినా అక్కడే కూర్చొంటారు.. లేదంటే ఔట్ హౌస్ కు వెళ్లిపోతారు అంటూ గట్టిగానే క్లాస్ తీసుకున్నారు.

ఇక తర్వాత ఇమ్మాన్యుయేల్ కు గోల్డెన్ స్టార్ ఇచ్చారు. ఆట ఇరగదీస్తున్నావ్ అని.. కానీ ఇంకా ముందుకు వెళ్లాలంటే మీ మమ్మీకి కాస్త దూరంగా ఉండాలని సలహా ఇచ్చారు నాగ్. ఆ తర్వాత శ్రీజ ఇక్కడి మాటలు అక్కడ చెప్పడం.. అక్కడి మాటలు ఇక్కడ చెప్పడం మానేయ్.. ఇంకా ఆటను ఇంప్రూవ్ చేసుకో అంటూ సిల్వర్ స్టార్ ఇచ్చారు. సుమన్ శెట్టిపై ప్రశంసలు కురిపించారు నాగ్. హనుమంతుడికి తన శక్తి తనకు తెలియనట్టు.. సుమన్ శెట్టికి తన శక్తి తెలియడం లేదు. నువ్వు ఆడుతుంటే భలే మజా వస్తుంది. స్ట్రాటజీలను అర్థం చేసుకోలేకపోతున్నావు. నీ స్థాయికి గోల్డ్ స్టార్ రావాలి.. నువ్వు బాటసారివి గుర్తుపెట్టుకో అంటూ సిల్వర్ స్టార్ ఇచ్చారు. ఇక తనూజ ఆట తీరుపై రియాక్ట్ అయ్యారు నాగ్. బంధాలు పెరిగితే భారంగా మారతాయి. అనవసరంగా ఏడవకు.. అదే నీ ఆటను ముంచేస్తుంది. నీ రైట్స్ కోసం నువ్వు ఫైట్ చేయి అంటూ చెప్పుకొచ్చారు. ఇక సంజనాతో జరిగిన పోపు గొడవలో వీడియో వేసి మరీ క్లారిటీ ఇచ్చారు.

ఇక తర్వాత రీతూకు సిల్వర్ స్టార్ ఇచ్చారు. గెలవాలనే తపనతోపాటు గెలుపుకు స్ట్రాటజీ కూడా కావాలని అన్నారు నాగ్. దీంతో రీతూ రియాక్ట్ అవుతూ.. స్ట్రాటజీలు వాడుతుంటే అన్ ఫెయిర్ ఆడుతున్నానని అంటున్నారు. నాకు మరీ అంత తక్కువ బ్రెయిన్ ఉందని అనుకుంటున్నారు అన్నది రీతూ. ఇక కళ్యాణ్, పవన్, రీతూ మధ్య జరిగిన గొడవపై మాట్లాడుతూ.. ఇద్దరి మధ్య మరోసారి ఫ్రెండ్షిప్ బాండ్ చేశారు. ఇక చివరగా సంజనకు గట్టిగానే ఇచ్చిపడేశారు. దొంగతనం, మాటలు జారడం, అతిగా ఆలోచించడం.. ఒక్క పాయింట్ తీస్తూ క్లాస్ తీసుకున్నారు. చివరకు హౌస్ లో ఏ పని చేయాలన్నా సంజన చేయాలంటూ పనిష్మేంట్ ఇచ్చారు. ఇక హౌస్ లో ఉన్న వాళ్లంల్లో పూర్ పర్ఫార్మెన్స్ కారణంగా హరీష్, ఫ్లోరాలకు వచ్చే రెండు వారాలకు నేరుగా నామినేట్ చేశారు నాగార్జున.

ఇవి కూడా చదవండి : Tollywood : 750కు పైగా సినిమాలు.. బ్రహ్మానందంతో ప్రత్యేక అనుబంధం.. ఈ కమెడియన్ ఎవరో గుర్తుపట్టారా.. ?

బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..