Tollywood : 750కు పైగా సినిమాలు.. బ్రహ్మానందంతో ప్రత్యేక అనుబంధం.. ఈ కమెడియన్ ఎవరో గుర్తుపట్టారా.. ?
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది కమెడియన్స్ తమ నటనతో, కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను అలరించారు. తెలుగులో వందలాది చిత్రాల్లో నటించి తమదైన ముద్రవేశారు. అందులో ఈ నటుడు ఒకరు. తన కామెడీ పంచులతో కడుపుబ్బా నవ్వించారు. ఆయన తెరపై కనిపిస్తే చాలు నవ్వులే నవ్వులు. ఇంతకీ ఆయన ఎవరో గుర్తుపట్టారా.. ?

సాధారణంగా సోషల్ మీడియాలో హీరోహీరోయిన్స్ చిన్ననాటి ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి. ఒకప్పుడు ఇండస్ట్రీలో చక్రం తిప్పిన తారల బాల్యం జ్ఞాపకాలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. తాజాగా ఓ ఫేమస్ కమెడియన్ త్రోబ్యాక్ ఫోటో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. పైన ఫోటోను చూశారు కదా.. అందులో కనిపిస్తున్న హాస్యనటుడు ఎవరో గుర్తుపట్టారా.. ? తెలుగు ప్రేక్షకులకు ఇష్టమైన నటుడు. బ్రహ్మానందం, ఏవీఎస్ వంటి పాపులర్ నటులు ఇండస్ట్రీని ఏలేతున్న సమయంలో సినీరంగంలోకి అడుగుపెట్టారు. తన నటనతో, కామెడీ పంచులతో కడుపుబ్బా నవ్వించారు. ఇంతకీ అతడు ఎవరో గుర్తుపట్టారా.. ?
ఇవి కూడా చదవండి : Megastar Chiranjeevi: అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఆ తర్వాత చిరు చెల్లెలిగా నటించిన ఏకైక హీరోయిన్.. ఇప్పుడు బుల్లితెరపై..
ఆ నటుడు ఎవరో తెలుసా..ఎం.ఎస్ నారాయణ. అసలు పేరు సూర్యనారాయణ. 1995లో పెదరాయుడు సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. తన కామెడీ, నటనతో ఆకట్టుకున్న ఆయన ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకున్నారు. తెలుగులో దాదాపు 750కి పైగా చిత్రాల్లో నటించారు. నటుడిగానే కాకుండా రచయితగానూ రాణించారు. అంతకుముందు కొన్ని సినిమాలకు రచయితగా పనిచేశారు. అలాగే కొన్ని నాటకాలు రాశారు.
ఇవి కూడా చదవండి : Tollywood: స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్ హిట్స్.. సౌత్ ఇండస్ట్రీలో సెన్సేషన్ ఈ అమ్మడు..
రచయితగా, నటుడిగా, దర్శకుడిగా ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్నారు. హస్యనటుడిగా మంచి పేరు సంపాదించుకున్న ఆయన.. ఎక్కువగా తాగుబోతు పాత్రలతో ఫేమస్ అయ్యారు. అయితే కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడిన ఆయన 2015 జనవరి 23న హైదరాబాద్ లో మరణించారు. ఆయనకు ఇద్దరు కుమారులు శశికిరణ్, విక్రమ్. ఆయన కుమారుడు విక్రమ్ సైతం ఫేమస్ యాక్టర్.
ఇవి కూడా చదవండి : Tollywood : అబ్బబ్బో.. సీరియల్లో అమాయకంగా.. నెట్టింట పిచ్చెక్కించేలా.. హీరోయిన్స్ సైతం దిగదుడుపే..
ఇవి కూడా చదవండి : Bigg Boss 9 Telugu: బిగ్‌బాస్ హౌస్‌లో ఆడపులి.. యూత్‌కు తెగ నచ్చేస్తోన్న కంటెస్టెంట్..








